Yoga : వామదేవ ఆసనం (రెండో పద్ధతి) వల్ల ఎన్ని ప్రయేజనాలో తెలుసా?

మొదటగా బల్లపరుపు నేలపై రెండు కాళ్లు ముందుకు చాచి కూర్చోవాలి. తర్వాత ఎడమకాలి మోకాలిని మడిచి పాదాన్ని ఎడమ పిరుదు కింద పెట్టాలి.. Latest Telugu News

Update: 2022-10-10 06:28 GMT

దిశ, ఫీచర్స్: మొదటగా బల్లపరుపు నేలపై రెండు కాళ్లు ముందుకు చాచి కూర్చోవాలి. తర్వాత ఎడమకాలి మోకాలిని మడిచి పాదాన్ని ఎడమ పిరుదు కింద పెట్టాలి. ఇప్పుడు కుడి పాదాన్ని తీసుకొచ్చి ఎడమ తొడపై కార్నర్‌లో ఉంచాలి. తర్వాత కుడి అరచేతిని కుడివైపు నేలపై పెట్టాలి. ఎడమచేతితో ఎడమ పాదాన్ని నెమ్మదిగా పైకి లేపి నడుముభాగంలో అదిమి పట్టుకోవాలి. ఇప్పుడు కుడి పాదాన్ని కుడి చేతితో పైకి లేపుతూ ఎడమ పాదానికి దగ్గరగా తీసకురావాలి. ఈ భంగిమలో రెండు పాదాలు టచ్ చేసి ఉండాలి. ఈ సమయంలో వెన్నుముక, కుడిచేయి నిటారుగా ఉండేలా చూసుకోవాలి. ఇలా సాధ్యమైనంత సేపు ఆగి పూర్వ స్థితిలో రిలాక్స్ అవ్వాలి.

ప్రయోజనాలేంటి?

* శరీరంలో అధిక కొవ్వు కరిగిపోతుంది.

* సంతానోత్పత్తికి ప్రయోజనకరం.

* డిప్రెషన్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

* పొత్తికడుపు, వెన్నెముకను బలపరుస్తుంది.

* కండరాలను ఉత్తేజపరుస్తుంది.

Tags:    

Similar News