రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టడం లేదా.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి
రాత్రి పూట సరిగ్గా నిద్రపోవడం వలన ఆరోగ్యం బాగుంటుంది అంటారు. అయితే కొంత మందికి అస్సలే నైట్ టైంలో నిద్ర రాదు. అయితే అలాంటి వారు కొన్ని చిట్కాలు పాటించడం వలన రాత్రి పూట సరిగ్గా నిద్రపోతారంట.
దిశ, వెబ్‌డెస్క్ : రాత్రి పూట సరిగ్గా నిద్రపోవడం వలన ఆరోగ్యం బాగుంటుంది అంటారు. అయితే కొంత మందికి అస్సలే నైట్ టైంలో నిద్ర రాదు. అయితే అలాంటి వారు కొన్ని చిట్కాలు పాటించడం వలన రాత్రి పూట సరిగ్గా నిద్రపోతారంట. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
- రాత్రి పడుకునేముందు గోరు వెచ్చటి పాలు తాగడం వలన త్వరగా నిద్రపడుతుంది.
- పడుకునే 30 నిమిషాల ముందే ఫోన్ చూడటం ఆపాలి.
- పగటి సమయంలో ఎక్కువగా నిద్రపోకూడదు.
- రాత్రి సమయంలో టీ, కాఫీలు అస్సలు తీసుకోకూడదు.
- నిద్రపోయే ముందు బాదం తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది.
- రాత్రిపూట నిద్ర బాగా పట్టాలంటే గది చల్లగా ఉండాలి డార్క్ గా ఉండాలి. చీకటిగా ఉండేటట్టు చూసుకోండి. లైట్ లు అన్నీ కూడా ఆపేయండి నొప్పి ఒత్తిడి ఆస్తమా గుండెలో మంట నిద్రలేమీ సమస్యలు వలన రాత్రి పూట నిద్ర పట్టదు.
ఇవి కూడా చదవండి: