అబార్షన్ టాబ్లెట్స్ సురక్షితమా.. కాదా..?
దిశ, వెబ్‌డెస్క్ : అవాంఛీత గర్భాన్ని తొలగించడానికి అబార్షన్ టాబ్లెట్స్ ఉపయోగిస్తారు.
దిశ, వెబ్‌డెస్క్ : అవాంఛీత గర్భాన్ని తొలగించడానికి అబార్షన్ టాబ్లెట్స్ ఉపయోగిస్తారు. అయితే వీటిని ఎలా పడితే అలా వాడటం ప్రమాదకరం. మన దేశంలో నేరం కూడా. తప్పని పరిస్థితుల్లో కోర్టుల అనుమతి, వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వీటిని వాడాల్సి ఉంటుంది. గర్భం ప్రారంభ దశలో ఉన్నప్పుడు అబార్షన్ టాబ్లెట్స్ 99.6 శాతం గర్భాన్ని సురక్షితంగా తొలగించగలవని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ మెడికల్ అబార్షన్ వైద్యుని సహాయం లేకుండా.. టాబ్లెట్ల సహాయంతో గర్భధారణ ప్రారంభంలోనే తొలగించడానికి సమర్థవంతగా పనిచేస్తుంది. ఇక ఆ సమయంలో ఈ అబార్షన్ పిల్ ఎలా పనిచేస్తుంది? ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో తెలుసుకుందాం.
అబార్షన్ పిల్ ఎలా పనిచేస్తుంది?
మహిళలు గర్భవతిగా ఉన్న సమయంలో ఈ మాత్రలు.. శరీరంలో ఉత్పత్తి అయ్యే గర్భధారణ హార్మోన్ ప్రొజెస్టెరాన్‌ను ప్రభావితం చేస్తాయి. దీని కారణంగా పిండం గర్భాశయం నుంచి బయటకు వస్తుంది. సాధారణంగా టాబ్లెట్ వేసుకున్న చాలామంది స్త్రీలలో.. గంట తర్వాత అధిక తిమ్మిరి మరియు రక్తస్రావం కలుగుతుంది. దాని ఫలితంగా రక్తం ఎక్కువగా గడ్డకట్టడం మరియు కణజాల గుబ్బలు అనేవి కొంత సమయం వరకు విపరీతమైన నొప్పిని కలిగిస్తాయి. ఆ నొప్పి భరించలేనంతంగా ఉంటే.. కంట్రోల్ చేసే టాబ్లెట్స్‌ను తీసుకోవాలని డాక్టర్స్ సలహా ఇస్తున్నారు.
మెడికల్ అబార్షన్ సైడ్ ఎఫెక్ట్స్..
గర్భాన్ని తొలగించుకున్న తర్వాత కొన్ని సైడ్ ఎఫెక్ట్స్‌తో బాధపడవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
* బొడ్డు ప్రాంతంలో తిమ్మిరి మరియు అధిక నొప్పులు
* విపరీతమైన రక్తస్రావం మరియు రక్తం గడ్డకట్టడం
* వాంతులు మరియు అజీర్ణం
* అతిసారం, అలసట
* తేలికపాటి ఫీవర్, బాడీ పెయిన్స్
టాబ్లెట్ రుతుచక్రాన్ని ప్రభావితం చేస్తుందా?
అధిక రక్తస్రావం :
టాబ్లెట్ వేసుకున్న కొన్ని రోజులు లేదా వారాల పాటు అధిక రక్తస్రావం కావడం చాలా సాధారణం. అయినప్పటికీ ఆ సమయంలో మహిళలు సుఖంగా ఉండటానికి శానిటరీ ప్యాడ్‌లు లేదా టాంపాన్‌లను ఉపయోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
కడుపునొప్పి :
గర్భస్రావం సమయంలో పిండం కాకుండా, అనేక ఇతర ద్రవాలు కూడా శరీరం నుండి బయటకు వస్తాయి. దీని కారణంగా పొత్తికడుపులో నొప్పి, కాళ్లు తిమ్మిరి, వికారం.. కొన్నిసార్లు విరేచనాలు, తలనొప్పి, జ్వరం వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు. అందువల్ల ఉపశమనం కోసం టాబ్లెట్స్ లేదా వేడి నీటి బాటిల్‌ను ఉపయోగించాలి. దీని తర్వాత అబార్షన్ అనేది కొత్త రుతుచక్రాన్ని ప్రారంభిస్తుంది. దీంతో మెడిసిన్ తీసుకున్న 4 నుంచి 8వారాల తర్వాత పీరియడ్స్ మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటాయి.
టాబ్లెట్ పని చేయకపోతే ఈ క్రింది లక్షణాలను గుర్తించాలి
* టాబ్లెట్ వేసుకున్న 24 గంటల తర్వాత రక్తస్రావం ఉండదు
* భరించలేని కడుపు నొప్పి
* పెద్దగా రక్తం గడ్డకట్టడం
* నిరంతర జ్వరం, వికారం మరియు తల తిరగడం
వైద్యులు ఏం చెబుతున్నారంటే..
ఇలాంటి నిరంతర లక్షణాలు ఇన్పెక్షన్ సంకేతాలు కావచ్చు. అందువల్ల దీనికి తక్షణ శ్రద్ధ చాలా అవసరం. ఇలాంటి విషయాల్లో వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యమని చెబుతున్నారు. అంతేకాకుండా.. టాబ్లెట్స్ ఉపయోగించే ముందు ఆరోగ్య సమస్యల గురించి డాక్టర్‌తో ఎల్లప్పుడు చర్చించాలి. తద్వారా అబార్షన్ మంచిదా కాదా అనేది డాక్టర్ నిర్ణయించవలసి ఉంటుందని పేర్కొన్నారు.
అలాంటి అబ్బాయి కావాలి.. హెబ్బా పటేల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్