ఉలవలు తినటం వలన ఎన్ని ప్రయోజనాలో..
ఉలవలు తినటం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
దిశ, వెబ్ డెస్క్: ఉలవలు తినటం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటో చూద్దాం. మూత్రాశయంలో రాళ్లను కరిగించి, కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తాయి. ఆకలిని పెంచుతాయి. ఉలవలతో చేసిన చారును తీసుకోవడం వలన పొట్ట తగ్గుతుంది. మహిళల్లో నెలసరి సమస్యలు నయమైపోతాయి. ప్రసవం అయ్యాక మహిళలు ఉలవలతో చేసిన ఉండలను తీసుకోవడం మంచిదని, ఉలవ నూకలతో చేసిన గంజిని తాగితే ఆరోగ్యానికి బలాన్ని ఇస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ గంజిని రోజు గ్లాసు తీసుకోవటం వలన ఎముకలు, నరాలకు మేలు జరుగుతుందట. ఉలవలను నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగటం వలన బరువు తగ్గవచ్చు. శరీరంలోని మలినాలు తొలగిపోతాయి. అనవసరపు కొవ్వు కరిగిపోతుంది. ఉలవల్లో ఉండే పిండి పదార్థాలు ఆరోగ్యానికి చురుకుతనాన్ని ఇస్తాయి. ఉలవలను నానాబెట్టి తీసుకోవచ్చు లేదా వేయించి తినవచ్చు. ఉడికించి అయిన తినవచ్చు. ఉలువలు ఉడికించి ఆ నీటిని తాగటం వలన జలుబు త్వరగా తగ్గుతుంది.
Read More... వేసవిలో వీటిని తీసుకుంటే.. గుండెకు చాలా మంచిది