మద్యం సేవించే వారు ఉదయం తప్పక టిఫిన్ చేయాలా?
చాలా మంది ఉదయం సరిగా టిఫిన్ చేయరు. కొందరు తమ బిజీ షెడ్యూల్ వలన టిఫిన్ చేయకపోతే, మరికొందరు టిఫిన్ చేయడానికే ఆసక్తి చూపురు. కానీ ఉదయం టిఫిన్ చేయకపోతే అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే
దిశ, వెబ్‌డెస్క్ : చాలా మంది ఉదయం సరిగా టిఫిన్ చేయరు. కొందరు తమ బిజీ షెడ్యూల్ వలన టిఫిన్ చేయకపోతే, మరికొందరు టిఫిన్ చేయడానికే ఆసక్తి చూపురు. కానీ ఉదయం టిఫిన్ చేయకపోతే అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంటుంది అంటున్నారు వైద్యులు. అయితే మద్యం సేవించే అలావాటు చాలా మందికే ఉంటుంది. అలాంటి వారిలో కొందరు టిఫిన్ చేయకుండానే ఆఫీసుకు రావడం లాంటివి చేస్తారు.
కాగా, మద్యం సేవించే వారు ఉదయం తప్పకుండా టిఫిన్ చేయాలా? ఒక వేళ చేయకపోతే ఏమౌతుందో ఇప్పుడు చూద్దాం. ఎవరికయితే మద్యం సేవించే అలవాటు ఉంటుందో వారు కనుక ఉదయం అల్పాహారం తినకపోతే హ్యాంగోవర్ సమస్య మరి అధికం అవుతుందంట, ఫలితంగా షుగర్ లెవెల్స్ పడిపోతాయంటున్నారు ఆరోగ్య నిఫుణులు.
అందుకే రాత్రి పూట మద్యం సేవించిన వారు ఉదయం పూట తప్పనిసరిగా టిఫిన్ చేయాలి. అంతే కాకుండా అధిక బరువుతో బాధపడుతున్నవారు తప్పనిసరిగా టిఫిన్ చేయాలంట. లేకపోతే ఇంకా బరువు పెరిగే అవకాశం ఉంటుందంట.