బీకేర్ ఫుల్ : పాలు కలిపిన టీ తాగుతున్నారా..
ఉదయం అయ్యిందంటే చాలు అందరికీ ముందుగా గుర్తు వచ్చేది టీ. తెల్లవారు జామున్నే టీ తాగనిదే కొందరికి రోజే గడవనట్టు ఉంటుంది. ఇంక కొంత మందికి టీ తాగకపోతే తలనొప్పి, రోజు మొత్తం ఏదో కోల్పోయినట్లుగా అనిపిస్తుందని
దిశ, ఫీచర్స్ : ఉదయం అయ్యిందంటే చాలు అందరికీ ముందుగా గుర్తు వచ్చేది టీ. తెల్లవారు జామున్నే టీ తాగనిదే కొందరికి రోజే గడవనట్టు ఉంటుంది. ఇంక కొంత మందికి టీ తాగకపోతే తలనొప్పి, రోజు మొత్తం ఏదో కోల్పోయినట్లుగా అనిపిస్తుందని చెబుతుంటే వింటుంటాం. ఇక ఆఫీసుల్లో పని చేసేవారు స్ట్రెస్ నుంచి రిలీఫ్ పొందడానికి రోజులో రెండు నుంచి మూడు సార్లు టీ తాగుతుంటారు.
అయితే టీ ఆరోగ్యానికి మంచిదే అయినా అతిగా తాగితే అనారోగ్యం భారిన పడే అవకాశం ఎక్కువగా ఉన్నదంట. పాలను డైరెక్ట్‌గా బ్లాక్ టీలో కలిపి తీసుకోవడం అనారోగ్య సమస్యలకు స్వాగతం పలుకుతున్నట్లేనని, అంతేకాకుండా పాలను, టీపొడితో కలిపి తీసుకోవడం వలన గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నదంటున్నారు వైద్యులు.
పాలలో కేసిన్అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది దంబీకేర్ ఫుల్ : పాలు కలిపిన టీ తాగుతున్నారా..తాల ఎనామెల్‌పై ప్రభావం చూపుతుంది. అందుకే టీని సిప్ చేసిన తర్వాత నోట్లో కాసిన్ని నీళ్లు పోసుకుని పుక్కిలించడం ద్వారా ఎనామెల్‌పై ఉన్న అవశేష టానిన్‌లను తొలగించుకోవచ్చు. అలాగే పాలు కలిపిన టీలో కేలరీలు, చక్కెర అధికంగా ఉంటాయి. అధికసార్లు ఈ టీ తీసుకోవడం వల్ల బరువు పెరగడం జీర్ణ సమస్యల భారినపడే అవకాశం ఎక్కువంట.ఇంకొంత మంది బ్లాక్ టీలో వేడి చేయని పాలు పోసుకొని తాగుతుంటారు దీనివలన కూడా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.