Disposable Cups: డిస్పోజబుల్ కప్పుల్లో తాగుతున్నారా?! అయితే, మీ దేహంలో...
ఈ నానోపార్టికల్స్ శరీరంలోని సెల్ లోపలికి ప్రవేశించి.. Disposable Cups Release Trillions Of Microplastic Particles.
Disposable Cups Release Trillions Of Microplastic Particles
దిశ, వెబ్‌డెస్క్ః ఇటీవల అధ్యయనాల్లో భయం గొలిపే విషయాలు తెలిశాయి. మనిషి రక్తంలో, ఊపిరితిత్తుల కండరాల్లో మైక్రో ప్లాస్టీక్ కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. భూమిలో చేరిన ప్లాస్టీక్ మట్టిలో కలవగడానికే వందల సంవత్సరాలు పడితే, అలాంటిది మనిషి దేహంలోకి చేరిన ప్లాస్టీక్ ఎన్నో రోగాలకు కారణం కాకపోదు. ఆవశ్యకం కాకపోయినప్పటికీ ప్లాస్టీక్ వాడకం పెరుగుతూనే ఉంది. ఇక రెస్టారెంట్లలో, ఐస్‌క్రీమ్ పార్లర్లలో ఇతరత్రా ప్రదేశాల్లో మనం తినే ప్లేట్లూ, తాగే కప్పులు ప్లాస్టీక్ కాగా అవి మన ప్రాణాన్ని హరిస్తున్నాయని తెలుసుకోలేకపోతున్నాము. కొత్తగా వెలువడిన ఓ అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది. డిస్పోజబుల్(Disposable) కంటైనర్లు, కప్పులు మానవాళికి శాపం మారుతున్నాయనీ, వాటిపై ఉన్న సన్నని ప్లాస్టిక్ లైనింగ్ మనం తాగే డ్రింక్‌లో ట్రిలియన్ల కొద్దీ మైక్రోస్కోపిక్ ప్లాస్టిక్ కణాలను నింపుతుందని ఈ అధ్యయనంలో తెలిసింది.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ చేసిన పరిశోధనలో తక్కువ-సాంద్రత కలిగిన పాలిథిన్‌తో పూసిన సింగిల్ యూజ్ వేడి పానీయాల కప్పులను విశ్లేషించారు. ఈ పరిశోధనలో కప్పులను 100 డిగ్రీల సెల్సియస్ వేడి వద్ద పానీయాలను కలిపినప్పుడు, లీటరుకు ట్రిలియన్ల నానోపార్టికల్స్ నీటిలో విడుదలైనట్లు తెలుసుకున్నారు. కొన్ని విశ్లేషణల తరువాత, నానోపార్టికల్ సగటు పరిమాణం 30 నానోమీటర్లు, 80 నానోమీటర్ల మధ్య 200 నానోమీటర్ల కంటే ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. "మా అధ్యయనంలో భయానక ఫలితాలు కనిపించాయి. ఈ నానోపార్టికల్స్ నిజంగా చాలా చిన్నవి. కానీ, ఇది చాలా పెద్ద విషయం. ఎందుకంటే, ఈ నానోపార్టికల్స్ శరీరంలోని సెల్ లోపలికి ప్రవేశించి, దాని పనితీరుకు అంతరాయం కలిగించవచ్చు.." అని పరిశోధకులు ఈ అధ్యయనంలో పేర్కొన్నారు.