Health tips : ఉదయం పూట వీటిని తింటే మంచిది కాదట !

ఉదయం పూట మనం తీసుకునే ఆహారం మన శరీరానికి కావలిసినంత శక్తినిస్తుంది.

Update: 2022-11-28 09:19 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఉదయం పూట మనం తీసుకునే ఆహారం మన శరీరానికి కావలిసినంత శక్తినిస్తుంది. ఎందుకంటే చాలా మంది ఉరుకులు.. పరుగులు జీవితంలో హడావుడిగా వెళ్తుంటారు. టిఫిన్‌‌ కూడా తినకుండా పనులు చేస్తూనే ఉంటారు. ఎన్ని పనులున్నా టిఫిన్ సరయిన సమయంలో తీసుకోవాలి. తినకుండా పని చేస్తూ ఉంటే నీరసంగా అవుతారు.అలా అని ఏవి పడితే అవి తినకూడదు..ముఖ్యంగా వీటిని తీసుకోవడం మంచిది కాదని నిపుణులు వెల్లడించారు. అవి ఏంటో ఇక్కడ చూద్దాం.

బ్రెడ్

ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు బ్రెడ్ తీసుకుంటారు. ఖాళీ కడుపుతో ఇది తీసుకోవడం మంచిది కాదట. ఎందుకంటే దీనిలో మనం అవసరమయ్యే పోషకాలు ఎక్కువ ఉండవు కాబట్టి ... ఉదయాన్నే తినవద్దని నిపుణులు వెల్లడించారు. కొంత మంది అయితే వీటితో బ్రెడ్ తో జామ్ , సాస్ ను కలుపుకొని తింటుంటారు. వైట్ బ్రెడ్ ఉదయాన్నే తీసుకోకండి.

కాఫీ

మనలో చాలా మందికి ఉదయం లేవగానే కాఫీ తాగే అలవాటు ఉంది. వారి డే కాఫీతోనే మొదలవుతుంది . ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిది కాదని శిఖా అగర్వాల్‌ తెలిపారు. ఇది జీర్ణ వ్యవస్థను బాగా దెబ్బతీస్తుందని వెల్లడించారు. చాలా మంది టిఫిన్ తిన్న తర్వాత అయిన తర్వాత కాఫీ తాగుతుంటారు. ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా ప్రమాదమని నిపుణులు వెల్లడించారు. 

ఇవి కూడా చదవండి 

Health tips: డెయిలీ హ్యాబిట్స్‌తో అనారోగ్యం.. 

Tags:    

Similar News