పాప్ కార్న్ తినడం శరీరానికి ప్రయోజనకరమా.. హానికరమా?
మొక్కజొన్నలతో తయారు చేసే పాప్‌కార్న్‌ను చిన్న పిల్లల కానుండి పెద్దవారి వరకు ఎంతో ఇష్టంగా తింటుంటారు..
దిశ, వెబ్ డెస్క్: మొక్కజొన్నలతో తయారు చేసే పాప్‌కార్న్‌ను చిన్న పిల్లల కానుండి పెద్దవారి వరకు ఎంతో ఇష్టంగా తింటుంటారు. అలాగే సినిమాలకు వెళ్లినప్పుడు వీటిని తింటూ ఎంజాయ్ చేస్తారు. అయితే కొంత మందికి వీటిని ఎక్కువగా తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయనే అనుమానం ఉంటుంది. అలాంటి వారు ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే. పాప్‌కార్న్‌లో ఫైబర్, యాంటీఆక్సిడెంట్, విటమిన్ బి కాంప్లెక్స్, మాంగనీస్, మెగ్నీషియం ఉండి శరీరానికి మంచి ఫలితాలను కలిగిస్తాయి.
*పాప్ కార్న్ తినడం వల్ల మలబద్ధకం, గుండె పోటు, వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
*యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ప్రమాదకరమైన క్యాన్సర్‌ను నిరోధిస్తాయి.
*అధిక బరువుతో బాధపడేవారు పాప్‌కార్న్ తింటే తొందరగా నాజుకుగా తయారవుతారు.
* వీటిని ఎక్కువగా తింటే వయసు పెరగడం వల్ల వచ్చే వృద్ధాప్య ఛాయలు, మచ్చలు, కండరాల బలహీనత, జుట్టు రాలడం వంటి వాటివి దరి చేరకుండా ఉంటాయి.
*పాప్‌కార్న్ తినడం వల్ల శరీరానికి మేలు జరుగుతుందని నెయ్యి, ఉప్పు ఉన్న పాప్‌కార్న్‌ను తింటే పలు రకాల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.