పచ్చి పల్లీలు తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

చాలా మంది పల్లీలను ఎంతో ఇష్టంగా తింటుంటారు. కొందరు వీటిని నానబెట్టుకొని తింటే మరికొందరు నార్మల్‌గా తినేస్తుంటారు. అయితే అసలు పచ్చి పల్లీలు తినడం ఆరోగ్యానికి మంచిదేనా అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది.

Update: 2023-05-29 09:18 GMT

దిశ, వెబ్‌డెస్క్ : చాలా మంది పల్లీలను ఎంతో ఇష్టంగా తింటుంటారు. కొందరు వీటిని నానబెట్టుకొని తింటే మరికొందరు నార్మల్‌గా తినేస్తుంటారు. అయితే అసలు పచ్చి పల్లీలు తినడం ఆరోగ్యానికి మంచిదేనా అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. కాగా, పచ్చి పల్లీలు తినడం ఆరోగ్యానికి మంచిదో కాదో తెలుసుకుందాం.

పచ్చి పల్లిల్లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్ మొదలైనవి. అలానే వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గిస్తాయి. అంతే కాకుండా పచ్చిపల్లిలలో ఉండే మోనో అన్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పాలీ అన్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్ లెవెల్స్ ని పెంచుతాయి. హృదయ సంబంధిత సమస్యలకు దూరంగా ఉండేందుకు పల్లీల తో అవుతుంది. ఇందులో ప్రోటీన్ ఫైబర్ హెల్ది ఫ్యాట్స్ ఉండడం వలన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది పైగా ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. అందువలన పచ్చి పల్లీలు తినడం ఆరోగ్యానికి మంచిదే అంటున్నారు వైద్యులు. కానీ పదే పదే పల్లీలు తినడం ఆరోగ్యానికి మంచిది కాదంట.

Read more : గృహిణీలకు చిట్కాలు.. వంటగదిలో ఇలా చేస్తే మీరు క్వీన్‌నే..!

Tags:    

Similar News