మధ్యాహ్నం నిద్ర ఆరోగ్యానికి మంచిదేనా?
మధ్యాహ్నం తిన్న తర్వాత వెంటనే చాలా మందికి నిద్ర వస్తుంటుంది. కొందరు నిద్ర పోతే, మరి కొందరు మధ్యాహ్నం కునుకు తియడానికి ఇష్టపడరు. కానీ మధ్యాహ్నం వేళ ఓ కునుకు తీయడం
దిశ, వెబ్‌డెస్క్ : మధ్యాహ్నం తిన్న తర్వాత వెంటనే చాలా మందికి నిద్ర వస్తుంటుంది. కొందరు నిద్ర పోతే, మరి కొందరు మధ్యాహ్నం కునుకు తియడానికి ఇష్టపడరు. కానీ మధ్యాహ్నం వేళ ఓ కునుకు తీయడం ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు ఆరోగ్యనిఫుణులు.
కానీ చాలా మందికి కొన్ని అపోహలు ఉంటాయి. మధ్యాహ్నం నిద్రపోతే , రాత్రి సరిగ్గా నిద్రపట్టదు. దీంతో అనారోగ్య సమస్యల భారిన పడక తప్పదు అంటారు. అయితే అలాంటి వాటిని కొట్టిపడేస్తున్నారు జనరల్ సైకియాట్రీ. అయితే ఓ అధ్యాయనం ప్రకారం.. మధ్యాహ్నం నిద్రపోయే వారిలో మెదడు చురుగ్గా పని చేస్తుందంట. అయితే మధ్యాహ్నం నిద్ర అనేది రెండుగంటల కంటే ఎక్కువసేపు కోకూడదంట.
మధ్యాహ్నం పూట కాసేపు నిద్ర పోవడం వల్ల,మెదడు పనితీరు మెరుగు పడి జ్ఞాపక శక్తి పెరుగుతుందంట. అంతేకాకుండా పనిపై ఏకాగ్రతను పెంపొందించుకోవచ్చు. అలాగే మధ్యాహ్నం కునుకు తీయడం వలన రోగ నిరోధకక శక్తి పెరిగి, ఆరోగ్యంగా ఉంటారంట.
ఇవి కూడా చదవండి : వేసవిలో పచ్చి మామిడి కాయ తినడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే!