గోళ్ల పై తెల్లటి మచ్చలు ఏర్పడుతున్నాయా.. ఈ సమస్యలు ఉన్నట్టే...

సాధారణంగా ప్రతి ఒక్కరి గోళ్లు లేత గులాబీ రంగులో అందంగా ఉంటాయి.

Update: 2024-05-15 12:27 GMT

దిశ, ఫీచర్స్ : సాధారణంగా ప్రతి ఒక్కరి గోళ్లు లేత గులాబీ రంగులో అందంగా ఉంటాయి. మరి కొంతమంది గోర్లు కాస్త నలుగు రంగులో ఉంటాయి. కొంతమంది గోర్లకు ఏదో డిజైన్ పెట్టినట్టు గోర్ల కొసల్లో తెల్లటి చంద్రవంక లాగా ఓ గుర్తు ఉంటుంది. దీన్ని లునులా అని పిలుస్తారు. గోళ్ల మీద ఉండే ఈ తెల్లమచ్చలను ల్యూకోనిచియా అని పిలుస్తారు. శరీరంలో కొన్ని ప్రోటీన్ల కొరత కారణంగా ఇలా గోర్ల పై తెల్లమచ్చలు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. మరికొన్ని సార్లు అనేక కారణాలతో తెల్లటి మచ్చలు ఏర్పడతాయని నిపుణులు చెబుతారు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గోళ్ళ పై తెల్లటి మచ్చలకు కారణాలు ?

మనిషి శరీరంలో సోడియం, కాపర్‌, జింక్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం లోపాలు ఉన్నట్టయితే గోరు ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తుంది. అంతే కాదు జెల్ లాగా ఉండే గోరు ఉత్పత్తులు, యాక్రిలిక్ గోళ్లను దెబ్బతీసి తెల్ల మచ్చలను కలిగిస్తాయి. అలాగూ వైట్ మిడిమిడి ఒనికోమైకోసిస్ అనే ఫంగస్ గోళ్ల పై వైట్ షేడ్ ను కల్పిస్తాయి.

గోళ్ల పై తెల్లమచ్చలకు హోం రెమెడీస్ : ఏదైనా గోటికి పెట్టే ఉత్పత్తిని వినియోగించిన తరువాత నెయిల్స్ పై తెల్ల రంగు మచ్చలు కనిపిస్తుంటాయి. అలాంటప్పుడు వాటిని ఉపయోగించకూడదంటున్నారు నిపుణులు.

వెల్లుల్లి : వెల్లుల్లి గోళ్లను బలంగా చేస్తుంది. గోళ్ల పై వెల్లుల్లి రెబ్బలను రోజూ రుద్దితే గోళ్లు బలంగా ఉండడంతో పాటు ఎలాంటి గాయాలు అయినా సరే తగ్గిపోయి తెల్ల మచ్చలు రాకుండా చేస్తుంది.

విటమిన్ ఇ ఆయిల్ : ప్రతిరోజూ చేతులతో పాటు గోళ్లకు కూడా మాయిశ్చరైజర్‌ని రాయాలి. అలాగే రాత్రి సమయాల్లో గోళ్ల పై విటమిన్ ఇ ఆయిల్ రాయాలి. ఇలా చేయడం ద్వారా గోళ్లు ఆరోగ్యంగా, అందంగా, బలంగా ఉండడంతో పాటు వైట్ హెడ్స్ తగ్గించేందుకు సహాయపడుతుంది.

Tags:    

Similar News