మనిషికి సంపూర్ణ నిద్ర ఎన్నిగంటలు ఉంటుంది.. నిద్ర శాస్త్రం ఏం చెబుతుందో చూడండి..

గొప్ప వ్యక్తులు జీవితంలో గొప్ప విషయాలను గురించి చెబుతుంటారు.

Update: 2024-05-24 11:16 GMT

దిశ, ఫీచర్స్ : గొప్ప వ్యక్తులు జీవితంలో గొప్ప విషయాలను గురించి చెబుతుంటారు. వీటిలో మొదటిది ఆరోగ్యకరమైన శరీరం, రెండవది మంచి నిద్ర. కానీ నేటి కాలంలో మంచి నిద్ర పొందడం పెద్ద సమస్యగా మారింది. చెడు జీవనశైలి, ఫోన్ వాడకం, మాదకద్రవ్యాలు తీసుకోవడం మంచి నిద్రను రానివ్వవు. నిద్రలేమి కూడా అనేక వ్యాధులకు కారణమవుతోంది. దీనివల్ల ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు, మానసిక ఆరోగ్యం క్షీణించి ప్రజలు బాధితులుగా మారుతున్నారు. సోషల్ మీడియా యుగంలో నిద్రలేమి ఒక వ్యాధిగా మారుతోంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ప్రజలు మందులు వేసుకుంటున్నారు. మరికొంతమంది సంవత్సరాలుగా చికిత్స తీసుకుంటారు. అయితే మంచి నిద్ర అంటే ఏమిటి, ఎన్ని గంటలు ఉండాలి, మంచి నిద్ర ఎలా పొందవచ్చు. ఇలాంటి అనేక ప్రశ్నలు చాలా మందికి వస్తుంటాయి. మరి ఆ సందేహాలకు సమాధానాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ ప్రకారం ఒక వ్యక్తి రోజుకు కనీసం 8 గంటలు నిద్రపోవాలి. చాలా మంది చాలా గంటలు నిద్రించడానికి ప్రయత్నిస్తారు. కానీ ప్రతి ఒక్కరు అంతగా నిద్రపోరు. చాలా మంది వ్యక్తులు కేవలం 4 గంటలు మాత్రమే నిద్రపోతారు. కేవలం ఈ కాస్త సమయంలోనే తమ నిద్రను పూర్తి చేస్తారు. అసలు అది ఏలా సాధ్యం, మరి 8 గంటలు నిద్రపోయే వారికి, 4 గంటలు నిద్రపోయేవారి మధ్య తేడా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నిద్రనాణ్యత ముఖ్యం..

నిద్రపోయే గంటలు కాకుండా నిద్ర నాణ్యత ముఖ్యమని వైద్యనిపుణులు చెబుతున్నారు. చాలా వరకు పరిశోధనలు ఏడెనిమిది గంటల నిద్ర ఉత్తమమని చెబుతున్నాయి. అయితే ఇది నిజంగా వ్యక్తి పై ఆధారపడి ఉంటుంది. కొంతమంది వ్యక్తులు రాత్రుళ్లు 8 లేదా అంతకంటే తక్కువ గంటలు నిద్రపోతారు. కానీ వారు పూర్తిగా రిఫ్రెష్‌గా ఉంటారు. మరికొందరికి విశ్రాంతి తీసుకోవడానికి 8 గంటల కంటే ఎక్కువ సమయం పడుతుంది. అయినా వారి నిద్ర పూర్తికాక డ్రౌసీగా ఉంటారు. మరి కొంతమంది కేవలం 4 గంటల్లోనే నిద్రను పూర్తి చేసుకుంటారు.

అయితే విశ్రాంతి తీసుకునే వ్యక్తి ఎంత సేపు గాఢ నిద్ర నిద్రపోతాడనే దాని పై ఆధారపడి ఉంటుంది. ఎక్కువ సమయం గాఢంగా నిద్రపోయేవారు 4 గంటల పాటు నిద్రిస్తే సరిపోతుందంటున్నారు నిపుణులు. వారిని డీప్ స్లీపర్స్ అంటారు. అలాంటి వ్యక్తులు తక్కువ నిద్రపోయిన తర్వాత కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కోరు. అయితే తేలికగా నిద్రపోయే వారు 7 నుండి 8 గంటల పాటు నిద్రపోయిన తర్వాత కూడా అసంపూర్ణమైన నిద్రను అనుభవిస్తారు. వీటిని లైట్ స్లీపర్స్ అంటారు. అయితే నిద్రను అర్థం చేసుకోవడానికి, మీరు నిద్ర చక్రం గురించి తెలుసుకోవాలి.

నిద్రచక్రం అంటే ఏమిటి ?

నిద్రచక్రంలో నిద్ర నుండి లేచే వరకు అనేక దశలుంటాయి. ఇది తేలికపాటి నిద్రతో ప్రారంభమవుతుంది. మీరు మంచం మీద పడుకున్న తర్వాత నిద్రపోవడం ప్రారంభించినప్పుడు ఈ దశ ప్రారంభమవుతుంది. ఇందులో నిద్ర స్వచ్ఛంగా ఉంటుంది. ఈ దశలో మెదడులో ఎలాంటి పనుల గురించి టెన్షన్ ఉండదు. 2 గంటల నిద్ర తర్వాత శరీరం తదుపరి దశకు వెళ్లడానికి సిద్ధమవుతుంది. ఈ సమయంలో కంటి కదలిక మందగించడం ప్రారంభమవుతుంది. హృదయ స్పందన రేటు కూడా సాధారణ స్థితికి వస్తుంది. రెండో దశ ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది.

రెండో దశ

రెండో దశ గాఢ నిద్ర. ఇందులో మెదడు ప్రశాంతంగా ఉండి గాఢంగా నిద్రపోతుంది. ఎక్కువసేపు గాఢనిద్రలో ఉండే వ్యక్తికి తక్కువ గంటలు నిద్రపోయినా పూర్తి నిద్ర వస్తుంది. ఈ దశలో నిద్రలో ఏ విధమైన జోక్యం ఉండదు. ఈ కాలంలో ఎలాంటి కలలు ఉండవు.

చివరి దశ.

చివరి దశను REM స్లీప్ అంటారు. ఈ దశలో నిద్ర దశ పూర్తవుతుంది. ఇందులో వ్యక్తి కలలు కంటాడు.

ఒక్కో దశకు వేర్వేరు సమయాలు..

గాఢ నిద్ర, తేలికపాటి నిద్ర, REM అనే ఈ మూడు దశలకు తీసుకునే సమయం వ్యక్తిని బట్టి మారవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఎక్కువసేపు తేలికపాటి నిద్రలో ఉన్నవారు 7 నుండి 8 గంటల పాటు నిద్రపోయిన తర్వాత పూర్తి అనుభూతి చెందుతారు. అయితే ఎక్కువ సేపు గాఢనిద్రలో ఉన్నవారు 4 గంటలపాటు నిద్రపోయిన తర్వాత మాత్రమే వారి నిద్ర పూర్తవుతుంది. REM స్టేజ్‌లో అంటే మూడో దశలో వ్యక్తులు 8 గంటల పాటు నిద్రపోయినా తమకు నిద్ర సరిపోవడం లేదని కొన్నిసార్లు అనుకుంటారు.

స్లీప్ సైకిల్‌ను అర్థం చేసుకోండి..

రాత్రి 10 నుంచి 11 గంటల మధ్య నిద్రించిన తర్వాత సాయంత్రం 6 గంటలకు కళ్లు తెరిస్తే మీ నిద్ర పూర్తయిందని అర్థం. అలాంటప్పుడు మీరు మళ్లీ నిద్రపోకూడదు. ఇలా చేయడం ద్వారా, శరీరం మళ్లీ రెండవ నిద్ర చక్రంలోకి వెళ్లడం ప్రారంభిస్తుంది. ఈ సమయంలో మీరు 8 లేదా 9 గంటల మధ్య మళ్లీ మేల్కొంటే, మీ నిద్రకు భంగం కలుగుతుంది. కొంతమందికి 8 నుంచి 9 గంటల పాటు నిద్రపోయినా ఫ్రెష్ గా అనిపించకపోవడానికి ఇదే కారణం.

కొంతమంది ఎందుకు తేలికగా నిద్రపోతారు?

తక్కువ నిద్రపోవడానికి లేదా తేలికపాటి నిద్రలో ఉండడానికి కొన్ని కారణాలు ఉండవచ్చు. అవి ఏంటంటే.

డిప్రెషన్ సమస్య

ఆందోళన

అధికంగా మద్యం సేవించడం

అధిక గురక

మానసిక ఒత్తిడి

మానసిక ఆరోగ్య సమస్యలు

గాఢ నిద్ర కోసం ఏమి చేయాలి..

సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి

ప్రతిరోజూ వ్యాయామం చేయాలి.

సౌకర్యవంతమైన mattress, దిండ్లు ఉపయోగించాలి.

రాత్రిపూట ఆల్కహాల్, టీ లేదా కాఫీ తాగవద్దు.

పడుకునే ముందు ఎలక్ట్రానిక్ పరికరాలను స్విచ్ ఆఫ్ చేయండి.

Tags:    

Similar News