స్వీట్స్ తింటే నిజంగానే షుగర్ వస్తుందా...?
స్వీట్స్ తింటే షుగర్ వస్తదని చాలా మంది అనుకుంటుంటారు. ఇంకొంతమంది అయితే... Health tips
దిశ, వెబ్ డెస్క్: స్వీట్స్ తింటే షుగర్ వస్తదని చాలా మంది అనుకుంటుంటారు. ఇంకొంతమంది అయితే చాలా భయపడిపోతుంటారు. అయితే వైద్య నిపుణులు తెలిపిన ప్రకారం.. చక్కెర, స్వీట్స్ తింటే షుగర్ జబ్బు వస్తుందనుకోవడం అపోహ మాత్రమే. అలాగని వాటిని అధికంగా తీసుకోవడమూ ముప్పే. మనం తీసుకున్న ఆహారంలోని పిండి పదార్థాలు గ్లూకోజ్(చక్కెర)గా మారాక అది శక్తి రూపంలో శరీరానికి అందాలి. ఎందుకంటే దానికి క్లోమ గ్రంథిలో తయారయ్యే ఇన్సులిన్ అనే హార్మోన్ దోహదపడుతుంది. అయితే, కొంతమందికి పుట్టుకతోనే ఇన్సులిన్ ఉత్పత్తి ఉండదు. వీరిని టైప్-1 మధుమేహ రోగులు అని అంటుంటారు. అధిక ఆహారం, వ్యాయామం లేకపోవడం, కాలుష్యం, వారసత్వం, మానసిక ఒత్తిడి లాంటి కారణాల వల్ల ఎక్కువ మందికి ఈ జబ్బు వస్తోంది. వీరిని టైప్-2 మధుమేహ రోగులు అని అంటారు. ఇన్సులిన్ ఉత్పత్తి జరగనప్పుడు తయారైన గ్లూకోజ్ రక్తంలోనే ఉంటుంది కానీ శక్తిగా మారదు. దీంతో పలు ఆరోగ్య సమస్యలు వస్తాయి. చక్కెర, స్వీ్ట్స్ అధికంగా తింటూ శారీరక శ్రమ తగ్గినప్పుడు ఊబకాయం వస్తుంది.