ఉదయాన్నే టిఫిన్ చేయడం లేదా.. అయితే ఈ సమస్యలు తప్పవు
చాలా మందికి ఉదయం టిఫిన్ చేసే సమయం ఉండదు. వెంటనే ఆఫీసుకు వెల్లాలని కొందరు, కాలేజ్ ఉందంటూ ఇలా పలురకాల కారణాలతో బ్రేక్ ఫాస్ట్ చేయడం మానేస్తారు.
దిశ, వెబ్ డెస్క్ : చాలా మందికి ఉదయం టిఫిన్ చేసే సమయం ఉండదు. వెంటనే ఆఫీసుకు వెల్లాలని కొందరు, కాలేజ్ ఉందంటూ ఇలా పలురకాల కారణాలతో బ్రేక్ ఫాస్ట్ చేయడం మానేస్తారు. అయితే ఉదయాన్నే అల్పాహారం తీసుకోకపోతే అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉందంట. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఉదయాన్నే టిఫిన్ చేయకపోతే ఆ రోజంతా చిరాకుగా ఉంటుందంట. అలాగే మెదడు సరిగా పనిచేయదంట. అలాగే సరైన సమయంలో ఆహారం తీసుకోకపోతే రక్తంలో చక్కెర స్థాయి క్షీణించి ఇది మధుమేహం లాంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే ఉదయం టిపిన్ చేయకపోతే, గ్యాస్, అల్సర్ లాంటి వ్యాధుల భారిన పడే అవకాశం ఉంది.