వామ్మో.. న్యూస్ పేపర్‌లో పెట్టిన ఫుడ్ తింటున్నారా.. ఆ సమస్యలు తప్పవు!
చాలా మందికి బయటి ఫుడ్ తినడం అలువాటే. ఇక పొద్దున్న ఆఫీసుకు వచ్చేవారు తప్పని సరిగా బయట నుంచి టిఫిన్ తెప్పించుకుంటుంటారు. అయితే
దిశ, వెబ్‌డెస్క్ : చాలా మందికి బయటి ఫుడ్ తినడం అలువాటే. ఇక పొద్దున్న ఆఫీసుకు వచ్చేవారు తప్పని సరిగా బయట నుంచి టిఫిన్ తెప్పించుకుంటుంటారు. అయితే ఇలా బయటి ఫుడ్ బజ్జీలు, జంక్ ఫుడ్, టిఫిన్ తీసుకొచ్చుకునే క్రమంలో వారు వార్తా పత్రిక పేపర్‌లో పెట్టి ఇవ్వడం కామన్. మనం కూడా న్యూస్ పేపర్‌నే కదా అని అలాగే తింటుంటాం. కానీ న్యూస్ పేపర్‌లో పెట్టిన ఆహారాన్ని తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని వైద్యులు అంటున్నారు.
అయితే న్యూస్ పేపర్‌కు వాడే ఇంక్ హానికరమైన వర్ణద్రవ్యాలు, రసాయన బైండర్లు హానీకరమైనదిగా ఉంటుంది. ఇది గనుక మానవ శరీరంలోకి వెళ్తే, అనేక అనారోగ్య సమస్యలు తప్పవంట, జీర్ణ క్రియకు సంబంధించిన సమస్యలు, క్యాన్సర్ సంబంధిత ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తాజాగా చేసిన పరిశోధనలు చెబుతున్నాయి.రీసైకిల్ చేయబడిన కాగితం యొక్క కార్డ్ బోర్డ్ కంటైనర్ల ఉత్పత్తి, థాలేట్లను కలిగి ఉండవచ్చునంట అందువలన రొమ్ము క్యాన్సర్ లాంటి అనేక వ్యాధుల భారీన పడే అవకాశం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు