బీకేర్ ఫుల్.. ఉదయాన్నే పరగడుపున టీ తాగడం ఎంత డేంజరో తెలుసా?

ఉదయం లేవగానే అందరికీ గుర్తు వచ్చేది టీ. చాలా మంది పొద్దున లేచిన వెంటనే టీ తాగుతుంటారు. ఒక వేళ ఉదయం టీ తాగడం లేదంటే కొందరికీ తలనొప్పి లాంటి సమస్యలు వేధిస్తాయి. మరికొందరికి అసలు ఉదయం టీ తాగనిదే ఆరోజు గడవనట్లు అనిపిస్తుంది.

Update: 2023-05-19 03:39 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఉదయం లేవగానే అందరికీ గుర్తు వచ్చేది టీ. చాలా మంది పొద్దున లేచిన వెంటనే టీ తాగుతుంటారు. ఒక వేళ ఉదయం టీ తాగడం లేదంటే కొందరికీ తలనొప్పి లాంటి సమస్యలు వేధిస్తాయి. మరికొందరికి అసలు ఉదయం టీ తాగనిదే ఆరోజు గడవనట్లు అనిపిస్తుంది.

కానీ ఉదయం లేవగానే పరగడుపున అస్సలే టీ తాగకూడదంట. దీని వలన అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంటుందంట.అవి ఏమిటంటే?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల శరీరంలో నీరు తగ్గిపోయి డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. దీనివల్ల మీకు కళ్లు తిరగడంతోపాటు మలబద్ధకం, గ్యాస్ సమస్యలు పెరుగుతాయంట. అంతే కాకుండా గ్యాస్, ఎసిడిటీ సమస్య పెరుగుతుంది. అలాగే ఖాళీ కడుపుతో టీ తాగడం వలన దంతాల బయటి పొర క్షీణించి, దంత క్షయం ప్రమాదాన్ని పెంచుతుంది. అందు వలన ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగకుండా, టీ తాగడానికి ముందు వాటర్ తాగడమో, లేక టిఫిన్ చేసి టీ తాగడమో లాంటిది చేయాలంట. ఇలా చేయడం వలన ఎలాంటి సమస్యలు దరి చేరవు.

Tags:    

Similar News