మొలకెత్తిన గింజలు ఆరోగ్యానికి ఎంత మంచివో తెలుసా?
ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. అందువలన ప్రతి ఒక్కరూ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటారు. కానీ,కొంత మంది మాత్రం మంచి ఆహారానికి బదులుగా రోడ్డుపై దొరికే ఆయిల్ ఫుడ్, చిప్స్, బర్గర్ లాంటి వాటిని తింటుంటారు.
దిశ, వెబ్‌డెస్క్ : ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. అందువలన ప్రతి ఒక్కరూ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటారు. కానీ,కొంత మంది మాత్రం మంచి ఆహారానికి బదులుగా రోడ్డుపై దొరికే ఆయిల్ ఫుడ్, చిప్స్, బర్గర్ లాంటి వాటిని తింటుంటారు.
అందువలన అలాంటి ఆహారం తీసుకోవడం కన్నా, మొలకెత్తిన గింజలను ప్రతి రోజూ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు వైద్యులు.దీని వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. అవి ఏమిటంటే?
మొలకెత్తిన గింజలలో విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజూ తీసుకోవడం వల్ల వృద్ధాప్య ఛాయలు తగ్గి నిత్యం యవ్వనంగా కనిపించవచ్చు. ఈ గింజలను మొలకెత్తించినప్పుడు వాటిలో పోషక విలువలు అధికశాతంలో పెరుగుతాయి. బరువు తగ్గాలని భావించే వారికి మొలకెత్తిన గింజలు బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి.ఎందుకంటే వీటిలో జీర్ణక్రియను మెరుగుపరిచే ఎంజైమ్ లు అధికంగా ఉంటాయి. ఈ ఎంజైమ్ లు ప్రోటీన్లను, శరీరానికి ఉపయోగపడే ఆమైనో ఆమ్లాలను, పిండి పదార్థాలను గ్లూకోజ్ గా మారుస్తాయి.