నల్ల యాలకులతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..
మనకు తరచూ వచ్చే ఎన్నో ఆరోగ్య సమస్యలను తొలగించే సుగంధద్రవ్యాలు, ఔషధాలు మన వంటింట్లోనే ఉన్నాయి.
దిశ, ఫీచర్స్ : మనకు తరచూ వచ్చే ఎన్నో ఆరోగ్య సమస్యలను తొలగించే సుగంధద్రవ్యాలు, ఔషధాలు మన వంటింట్లోనే ఉన్నాయి. అందులో ఒక ఔషధమే నల్ల యాలకులు. ఇదేంటి యాలకులు ఆకుపచ్చ రంగులో, చిన్నగా మాత్రమే ఉంటాయి కదా అనుకుంటారు. కానీ నల్లగా, పెద్ద సైజులో కూడా యాలకులు ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ సి, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ వంటి పోషకాలు ఉన్నాయి. నల్లయాలకులని తినడం వలన ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
రక్తప్రసరణ..
పెద్ద యాలకుల్లో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, పొటాషియంలు చర్మ, రక్త ప్రసరణని మెరుగుపరుస్తాయి. చర్మాన్ని నున్నగా, అందంగా, మెరిసేలా చేస్తుంది.
నోటి బ్యాక్టీరియా..
పెద్ద యాలకుల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలతో నోటిలోని బ్యాక్టీరియా దూరమవుతుంది. నోటి దుర్వాసన తగ్గి దంతాల ఇన్ఫెక్షన్, చిగుళ్ళ ఇన్ఫెక్షన్ కూడా దూరమవుతుంది.
కడుపు సంబంధిత సమస్యలు..
ఆకలి లేని వారు పెద్ద యాలకులు తింటే ఆకలి పెరుగుతుంది. కడుపులో గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యల్ని యాలకులు పోగొడతాయి.
కిడ్నీ సమస్యలు...
కిడ్నీ సమస్యలతో బాధపడేవారు రోజూ పెద్దయాలకులని తింటే కిడ్నీ సమస్యలు తొలగిపోతాయి. వీటి ద్వారా బాడీ నుండి టాక్సిన్స్ దూరమవడమే కాకుండా మూత్రవిసర్జన సమస్యల్ని కూడా దూరం చేస్తుంది.
గుండె ఆరోగ్యం..
పెద్ద యాలకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ఎంజైమ్స్ గుండె పనితీరును మెరుగు పరుస్తాయి. గుండె సమస్యలు తొలగిపోతాయి. గుండె కండరాల కణజాలం పై బాగా పనిచేస్తాయి.