నేల మీద కూర్చోవడం వలన ఎన్ని లాభాలో తెలుసా?
ఒకప్పుడు ఎక్కువగా నేల మీద కూర్చొని ముచ్చట్లు పెట్టేవారు. కానీ ఈరోజుల్లో నేల మీద కూర్చొవడం ఏదో తప్పు అన్నట్లుగా భావిస్తున్నారు. అస్సలే నేల మీద కూర్చొవడం లేదు. కనీసం తినే
దిశ, వెబ్‌డెస్క్ : ఒకప్పుడు ఎక్కువగా నేల మీద కూర్చొని ముచ్చట్లు పెట్టేవారు. కానీ ఈరోజుల్లో నేల మీద కూర్చొవడం ఏదో తప్పు అన్నట్లుగా భావిస్తున్నారు. అస్సలే నేల మీద కూర్చొవడం లేదు. కనీసం తినే సమయంలోనైనా సరే నేల మీద కూర్చోకుండా డైనింగ్ టేబుల్ మీద కూర్చొంటారు. కానీ కుర్చీ మీదో, టేబుల్ మీదో కూర్చోవడం కంటే నేల మీద కూర్చొవడం వలనే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
నేల మీద కూర్చోవడం వలన స్టెబులిటీ పెరుగుతుంది. అలాగే స్టేబుల్ గా కూర్చొంటాం. దీని వలన నడుము టైట్‌గా ఉంటుంది. అంతే కాకుండా కింద శరీర భాగాలకు వ్యాయామం అయినట్లు ఉండటం వలన నడుము నొప్పి సమస్య ఉండదు. అలానే కింద కూర్చోవడం వలన మజిల్ యాక్టివిటీ మరింత పెరుగుతుంది ఇలా కింద కూర్చోవడం వలన రకరకాల ప్రయోజనాలను మనం పొందవచ్చు. పలు రకాల సమస్యలు కూడా దూరమవుతాయి.
Read more: