Health tips: పశ్చిమోత్తనాసనం ప్రయోజనాలు.. (మొదటి పద్ధతి)

మొదటగా బల్లపరుపు నేలపై రెండు కాళ్లు ముందుకు చాచి కూర్చోవాలి. తర్వాత శరీరాన్ని ముందుకు వంచుతూ పొట్టను తొడలపై పెట్టాలి. అలాగే తలను మోకాళ్లపై ఆన్చాలి..Latest Telugu News

Update: 2022-09-24 04:51 GMT

దిశ, ఫీచర్స్: మొదటగా బల్లపరుపు నేలపై రెండు కాళ్లు ముందుకు చాచి కూర్చోవాలి. తర్వాత శరీరాన్ని ముందుకు వంచుతూ పొట్టను తొడలపై పెట్టాలి. అలాగే తలను మోకాళ్లపై ఆన్చాలి. ఇప్పుడు రెండు చేతులను ముందుకు చాచి రెండు పాదాలను పట్టుకోవాలి. ఈ భంగిమలో రెండు మోకాళ్లు, చేతులు నిటారుగా ఉండాలి. వెన్నుపూసను వీలైనంతవరకూ పైకి లేవకుండా నిటారుగా పడుకోబెట్టేందుకు ప్రయత్నించాలి. ఇలా సాధ్యమైనంత సేపు ఆగి పూర్వ స్థితిలోకి వచ్చి రిలాక్స్ అవ్వాలి.

ప్రయోజనాలు:

* హామ్ స్ట్రింగ్స్‌ను చక్కగా సాగదీస్తుంది.

* బొడ్డు చుట్టున్న కొవ్వును కరగదీస్తుంది.

* జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది.

* రుతుక్రమ అసౌకర్యం నుంచి ఉపశమనం.

* రక్త ప్రవాహాన్ని పెంచి, ఆందోళన తగ్గిస్తుంది.

* రాత్రిపూట హాయిగా నిద్రించేలా చేస్తుంది.

Tags:    

Similar News