వేసవి కాలంలో ప్రతి రోజూ పెరుగు తినడం వలన ఎన్ని ప్రయోజనాలో?

సమ్మర్ వచ్చిందంటే చాలు చాలా మంది, కూల్ వాటర్ తీసుకోవడానికి, చలువ ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతారు. కొంత మంది శరీరం డీ హైడ్రేషన్‌కు గురి కాకుండా ఉండేందుకు పెరుగు లేదా మజ్జిగ తాగుతుంటారు.

Update: 2023-03-07 06:42 GMT

దిశ, వెబ్‌డెస్క్ :  సమ్మర్ వచ్చిందంటే చాలు చాలా మంది, కూల్ వాటర్ తీసుకోవడానికి, చలువ ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతారు. కొంత మంది శరీరం డీ హైడ్రేషన్‌కు గురి కాకుండా ఉండేందుకు పెరుగు లేదా మజ్జిగ తాగుతుంటారు.

పెరుగులో మన శరీరానికి కావాల్సిన పోషక పదార్థాలు ఉంటాయి. వేసవి కాలంలో రోజు ఒక్కసారి తప్పనిసరిగా పెరుగుతో తినాలి అంటారు. కానీ కొందరు పెరుగు తినడం ఇష్టం ఉండదు. అయితే పెరుగు తినడం వలన కలిగే ఉపయోగాలు తెలిస్తే ఎవరూ తినకుండా ఉండలేరంటున్నారు వైద్యులు. కాగా, పెరుగు తినడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

1.పెరుగు తిన‌డం వ‌ల్ల ప్రోటీన్స్, ఎస్సెన్షియల్ విటమిన్లు, ఖనిజాలు మనలో శక్తిని పెంపొందిస్తాయి. మ‌రియు త‌క్ష‌ణ శ‌క్తిని అందిస్తాయి.

2.క్యాన్షర్‌ను అడ్డుకునే శక్తి పెరుగులో ఉంటుంది.

3. నిద్రపట్టని వారికి పెరుగు బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఆయుర్వేదంలో పెరుగు నిద్ర పట్టని వారికి వాడమని కూడా వెల్ల‌డించారు.

4.పెరుగు బ్ల‌డ్‌ ప్ర‌జ‌ర్‌ను కంట్రోల్ చేయ‌డంలోబాగా స‌హ‌య‌ప‌డుతుంది. మ‌రియు ప్ర‌తి రోజు పెరుగు తిన‌వడం వ‌ల్ల ర‌క్త‌ప్ర‌స‌వ‌ర‌ణ బాగా జ‌రిగి గుండె జ‌బ్బులు రాకుండా ర‌క్షిస్తుంది.

5.కడుపులో అల్సర్ ఉండే వారిలో, గ్యాస్ట్రిక్ ఇరిటెషన్ తో బాధపడేవారికి, హైపర్ ఎసిడిటీతో బాధపడేవారికి పెరుగు అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి.

Read more:

ఎగ్స్‌తో సైడ్ ఎఫెక్ట్స్.. తింటే ప్రమాదమే 

Tags:    

Similar News