మీరు ఐరన్ లోపంతో బాధపడుతున్నారా..?

దిశ, వెబ్‌డెస్క్: మన శరీరానికి ఐరన్ (ఇనుము) చాలా ముఖ్యం. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తక్కువగా ఉంటే అది మనిషిని బలహీనంగా మారుస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ కావాల్సిన మోతాదులో లేకపోతే అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది. ఇనుము లోపం క్రమక్రమంగా రక్తహీనతకు దారి తీస్తుంది. దీంతో రక్తంలోని ఎర్ర రక్త కణాల సంఖ్య తక్కువ అవుతుంది. వాటి ఆక్సిజన్ మోసే సామర్ధ్యం శారీరక అవసరాలను తీర్చడానికి సరిపోదు. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఐరన్ లోపంపై […]

Update: 2021-02-14 00:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: మన శరీరానికి ఐరన్ (ఇనుము) చాలా ముఖ్యం. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తక్కువగా ఉంటే అది మనిషిని బలహీనంగా మారుస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ కావాల్సిన మోతాదులో లేకపోతే అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది. ఇనుము లోపం క్రమక్రమంగా రక్తహీనతకు దారి తీస్తుంది. దీంతో రక్తంలోని ఎర్ర రక్త కణాల సంఖ్య తక్కువ అవుతుంది. వాటి ఆక్సిజన్ మోసే సామర్ధ్యం శారీరక అవసరాలను తీర్చడానికి సరిపోదు. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఐరన్ లోపంపై నివేదిక విడుదల చేసింది.

యునిసెఫ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. భారత్‌లో అధిక శాతం యువత ఐరన్ లోపంతో బాధపడుతున్నారని స్పష్టం చేసింది. 15-19 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికల్లో 56 శాతం మంది, బాలురులో 30 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారని తేలింది. దీంతో హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరచడానికి తల్లిదండ్రులు తగిన చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఐరన్ లోపం తలెత్తకుండా ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఐరన్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. ప‌ప్పు ధాన్యాలు, పాల‌కూర‌, గింజ‌ ప‌ప్పులు, చికెన్‌, కాబూలీ శ‌న‌గ‌ల్లో ఇత‌ర పోష‌కాల‌తో పాటు ఐర‌న్ ఎక్కువ‌గా ఉంటుంది. దీంతో పాటు జీల‌క‌ర్ర‌, కొత్తిమీర‌, ప‌సుపు, ఎర్ర మిర‌ప‌కాయ‌లు, బీట్ రూట్‌, ట‌మాట‌లు, యాపిల్స్‌, చెర్రీలు వంటి ఎరుపు ద‌నం ఉన్న పండ్లు, ఆహార ప‌దార్థాల్లో ఐర‌న్ ఎక్కువ‌గా ఉంటుంది.

నల్ల నువ్వుల్లో ఇనుము, రాగి, జింక్, సెలీనియం, విటమిన్- బి6, ఇ తో పాటు ఫోలేట్లు పుష్కలంగా లభిస్తాయి. కర్జూరా, ఎండుద్రాక్షలు ఇనుము, మెగ్నీషియం, రాగి, విటమిన్లు- ఎ మరియు సి లను కలిగి ఉంటాయి. వీటిని ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్‌గా లేదా సాయంత్రం స్నాక్స్ లాగా తింటే ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఇక బీట్‌రూట్, కారెట్లు కలిపి చేసిన జ్యూస్ తాగడం వల్ల ఇనుము శోషణ పెరుగుతుంది. వీట్ ‌గ్రాస్ బీటా కెరోటిన్, విటమిన్ కె, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్ విటమిన్ సి, అనేక బి విటమిన్ల అద్భుతమైన మూలాన్ని అందిస్తుంది. ప్రతిరోజూ ఉదయం ఒక టీస్పూన్ వీట్ గ్రాస్ తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు మెరుగుపడటమే కాక, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇక మోరింగా విత్తనాలు, ఆకులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

Tags:    

Similar News