చలికాలంలో క్యారెట్ తినవచ్చా ? ఆరోగ్య ప్రయోజనాలు

దిశ, వెబ్‌డెస్క్ : క్యారెట్ తినడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. అటు ఆరోగ్యాన్ని ఇటు అందాన్ని అందించే కూరగాయ క్యారెట్. క్యారెట్ వలన ఎన్నో లాభాలు ఉన్నాయి. అయితే ఏ సీజన్‌లో అయినా దొరికే ఈ క్యారెట్‌ను చలికాలంలో తినడం మంచిదేనా, కాదా అనేది తెలుసుకుందాం. చలికాలంలో క్యారెట్ తినడం ఆరోగ్యానికి మంచిదంటున్నారు వైద్య నిపుణులు. ఈ కాలంలో క్యారెట్ రుచిగా ఉండటమే కాకుండా ఎన్నో పోషక విలువలతో కూడి ఉంటుంది. అందు వలన శీతాకాలంలో క్యారెట్ […]

Update: 2021-12-12 23:20 GMT

దిశ, వెబ్‌డెస్క్ : క్యారెట్ తినడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. అటు ఆరోగ్యాన్ని ఇటు అందాన్ని అందించే కూరగాయ క్యారెట్. క్యారెట్ వలన ఎన్నో లాభాలు ఉన్నాయి. అయితే ఏ సీజన్‌లో అయినా దొరికే ఈ క్యారెట్‌ను చలికాలంలో తినడం మంచిదేనా, కాదా అనేది తెలుసుకుందాం.

చలికాలంలో క్యారెట్ తినడం ఆరోగ్యానికి మంచిదంటున్నారు వైద్య నిపుణులు. ఈ కాలంలో క్యారెట్ రుచిగా ఉండటమే కాకుండా ఎన్నో పోషక విలువలతో కూడి ఉంటుంది. అందు వలన శీతాకాలంలో క్యారెట్ తినడం ఆరోగ్యానికి శ్రేష్ఠకరం. శరీరానికి కావలసిన కాల్షియం, విటమిన్ కె క్యారెట్‌లో సమృద్ధిగా ఉంటాయి. అందువలన మనం క్యారెట్ తింటే ఎముకలు ధృడంగా ఉంటాయి. అంతే కాకుండా మలబద్ధకం లాంటి సమస్యలకు కూడా క్యారెట్ చెక్ పెడుతోంది. క్యారెట్ లో ఉండే పీచు పదార్థం వలన జీర్ణ క్రియ మెరుగ్గా పనిచేస్తుంది. క్యారెట్‌లో అధిక మొత్తంలో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది మన శరీరంలోని విటమిన్ ఎ ఎక్కువగా పెంపొందెలా చేసి కళ్ళను ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అందుకే క్యారెట్ ఎక్కువ తినడం వలన అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని, ఏ కాలంలోనైనా సరే క్యారెట్ ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

 

Tags:    

Similar News