నిధులను సేకరించనున్న హెచ్‌డీఎఫ్‌సీ

దిశ, వెబ్‌డెస్క్: ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ప్రాతిపదికన బాండ్లను జారీ చేయడం ద్వారా రూ. 5,000 కోట్ల వరకు వసూలు చేయనున్నట్టు ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (HDFC) వెల్లడించింది. ఈ మేరకు రెగ్యులేటరీ సంస్థకు నిధుల సమీకరణకు సంబంధించి సమాచారం ఇచ్చింది. నాన్-కన్వర్టబుల్ డిబెంచర్స్ ద్వారా రూ. 2500 కోట్లను సేకరించి, ఓవర్ సబ్‌స్క్రిప్షన్‌కు రూ. 2500 కోట్లను సేకరించనుంది. సంస్థ దీర్ఘకాలిక వనరులను పెంచేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని […]

Update: 2020-09-24 05:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ప్రాతిపదికన బాండ్లను జారీ చేయడం ద్వారా రూ. 5,000 కోట్ల వరకు వసూలు చేయనున్నట్టు ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (HDFC) వెల్లడించింది. ఈ మేరకు రెగ్యులేటరీ సంస్థకు నిధుల సమీకరణకు సంబంధించి సమాచారం ఇచ్చింది. నాన్-కన్వర్టబుల్ డిబెంచర్స్ ద్వారా రూ. 2500 కోట్లను సేకరించి, ఓవర్ సబ్‌స్క్రిప్షన్‌కు రూ. 2500 కోట్లను సేకరించనుంది.

సంస్థ దీర్ఘకాలిక వనరులను పెంచేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని కంపెనీ పేర్కొంది. ఈ నిధులను కార్పొరేషన్ వ్యాపార అవసరాలకు వినియోగించనున్నట్టు.. ఫైనాన్సింగ్, హౌసింగ్ రీఫైన్సింగ్ వ్యాపారంలో ఖర్చు చేయనున్నట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వివరించింది. నాన్-కన్వర్టబుల్ డిబెంచర్స్ కోసం బిడ్‌లను సెప్టెంబర్ 25న ప్రారంభించి, అదేరోజు ముగించనున్నట్టు వెల్లడించింది. అలాగే, కార్పొరేషన్ డైరెక్టర్, ఉద్యోగులకు 17 లక్షలకు పైగా వాటాలను కేటాయించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.

Tags:    

Similar News