రిఫ్రిజిరేటర్ల విభాగంలో ప్రవేశించిన హావెల్స్

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ హావెల్స్ (Havells) ఇండియా తన బ్రాండ్ లాయిడ్స్ కింద రిఫ్రిజిరేటర్ల విభాగంలోకి ప్రవేశించింది. ఇప్పటికే ఎల్ఈడీ టీవీలు, వాషింగ్ మెషీన్లకు మాత్రమే పరిమితమైన సంస్థ తాజాగా రిఫ్రిజిరేటర్ల తయారీతో పూర్తిగా వినియోగ వస్తువుల తయారీ కంపెనీగా మారింది. సైడ్ బై సైడ్, డైరెక్ట్ కూల్ విభాగంలో మొత్తం 25 మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్రస్తుత ఏడాది దీపావళి సమయానికి మరో 25 మోడళ్లను తీసుకురానున్నట్టు కంపెనీ ప్రకటించింది. గురువారం […]

Update: 2020-09-24 08:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ హావెల్స్ (Havells) ఇండియా తన బ్రాండ్ లాయిడ్స్ కింద రిఫ్రిజిరేటర్ల విభాగంలోకి ప్రవేశించింది. ఇప్పటికే ఎల్ఈడీ టీవీలు, వాషింగ్ మెషీన్లకు మాత్రమే పరిమితమైన సంస్థ తాజాగా రిఫ్రిజిరేటర్ల తయారీతో పూర్తిగా వినియోగ వస్తువుల తయారీ కంపెనీగా మారింది. సైడ్ బై సైడ్, డైరెక్ట్ కూల్ విభాగంలో మొత్తం 25 మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్రస్తుత ఏడాది దీపావళి సమయానికి మరో 25 మోడళ్లను తీసుకురానున్నట్టు కంపెనీ ప్రకటించింది.

గురువారం లాయిడ్ 190 లీటర్ల నుంచి 587 లీటర్ల వరకు సామర్థ్యం ఉన్న రిఫ్రిజిరేటర్లను విడుదల చేస్తూ.. వాటి ధరలు రూ. 10 వేల నుంచి రూ. 84,900 శ్రేణిలో లభిస్తాయని వెల్లడించింది. ఈ సందర్భంగా మాట్లాడిన కంపెనీ సీఈఓ శశి అరోరా మాట్లాడుతూ.. 2020 బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిసియన్సీ రేటింగ్ ప్రమాణాలను అనుసరించి ఉత్పత్తులను తీసుకొచ్చామని తెలిపారు. కొత్తగా తీసుకొచ్చిన ఈ రిఫ్రిజిరేటర్లు నూతన ఇన్వర్టర్ సాంకేతికతను ఉపయోగించడవం వల్ల తక్కువ విద్యుత్ వినియోగానికి వీలవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఏసీల విభాగంలో మూడవ అతిపెద్ద బ్రాండ్‌గా ఉన్నామని వివరించారు. కాగా, 2017లో లాయిడ్‌ను హావెల్స్ సంస్థ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News