కొవిడ్ వస్తే..వాసన ఎందుకు కోల్పోతామో తెలుసా.?

దిశ, వెబ్‌ డెస్క్: కరోనా లక్షణాల జాబితా పెరుగుతూనే ఉంది. జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఇవన్నీ ఉంటే కరోనాగా గుర్తించాలని తొలుత వైద్యులు సూచించారు. ఆ తర్వాత రుచి, వాసన కోల్పోవడం, కండ్లు ఎర్రబారడం, దద్దుర్లు ఇలా మొత్తంగా 14కు పైగా లక్షణాలను కరోనా లిస్టులో చేర్చారు. అయితే, కొంతమందిలో ఈ లక్షణాలు కూడా కనిపించడం లేదు. కొవిడ్‌ నిరోధించడానికి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అదే విధంగా లక్షణాల విషయంలోనే […]

Update: 2020-07-29 03:01 GMT

దిశ, వెబ్‌ డెస్క్: కరోనా లక్షణాల జాబితా పెరుగుతూనే ఉంది. జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఇవన్నీ ఉంటే కరోనాగా గుర్తించాలని తొలుత వైద్యులు సూచించారు. ఆ తర్వాత రుచి, వాసన కోల్పోవడం, కండ్లు ఎర్రబారడం, దద్దుర్లు ఇలా మొత్తంగా 14కు పైగా లక్షణాలను కరోనా లిస్టులో చేర్చారు. అయితే, కొంతమందిలో ఈ లక్షణాలు కూడా కనిపించడం లేదు. కొవిడ్‌ నిరోధించడానికి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అదే విధంగా లక్షణాల విషయంలోనే పలు అధ్యయనాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే.. కొవిడ్‌ పేషెంట్లలో వాసన చూసే శక్తిని కోల్పోవడానికి కారణాన్ని హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ పరిశోధకులు కనుగొన్నారు.

సాధారణంగా జలుబు చేస్తేనే..వాసనలు పసిగట్టలేకపోతాం. అయితే, కరోనా వచ్చినా కూడా ఇలానే జరుగుతోందని పలు అధ్యయనాల్లో ఇది వరకే వెల్లడైంది. నాలుక కూడా రుచులను గుర్తించకపోవడం కూడా కరోనా లక్షణమే అని వైద్య నిపుణులు ఎప్పుడో తేల్చారు. అందుకు కారణం కరోనా వైరస్‌ ప్రభావం ఘ్రాణశక్తికి సంబంధించిన నాడులపై పడటం వల్లనే ఆ శక్తి కోల్పోతున్నట్లుగా ఇన్నాళ్లూ భావించారు. కానీ, అది కాదని తేలింది. ఘ్రాణశక్తికి సంబంధించిన నాడులకు సహకరించే కీలక కణాల్లోకి వైరస్‌ చొరబడటం వల్లే ఇలా జరుగుతోందని వారి పరిశోధనలో తేలింది. ఈ పరిశోధన ఫలితాలు సైన్స్‌ అడ్వాన్సెస్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. హార్వర్డ్ మెడికల్ స్కూల్ నిపుణుల బృందం కొవిడ్-19 ఎక్కువగా హాని కలిగించే సెల్ సమూహాన్ని గుర్తించింది. వాసన భావాన్ని మెదడుకు గుర్తించి ప్రసారం చేసే న్యూరాన్లు హాని కలిగించే కణాలలో భాగం కాదని వారు కనుగొన్నారు. కరోనావైరస్ రోగులలో వాసన భావాన్ని కోల్పోవడం అనేది న్యూరాన్‌లకు నేరుగా సోకడం ద్వారా జరుగుతుందని గుర్తించారు. ఇందులోని సహాయక కణాల పనితీరును ప్రభావితం చేయడం ద్వారా ఇలా జరుగుతుందని తమ పరిశోధనలు సూచిస్తున్నాయని చెప్పారు.

Tags:    

Similar News