ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ కోసం బైక్ అమ్మకానికి పెట్టిన హీరో
దిశ, సినిమా : కొవిడ్‌తో భారత్ తల్లడిల్లుతుండగా.. ఈ ఆపద సమయంలో ప్రజలకు సాయం చేసేందుకు సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. సోషల్ మీడియా ఎకౌంట్స్‌లో హెల్ప్ లైన్ నంబర్స్ షేర్ చేస్తూ, హాస్పిటల్ బెడ్స్, ఆక్సిజన్ సిలిండర్ల లభ్యత గురించి ఇన్‌ఫర్మేషన్ ఇస్తున్నారు. మరికొందరు కొవిడ్ ఫండ్ రెయిజ్ చేస్తూ, విపత్కర పరిస్థితుల్లో దేశ ప్రజలకు మద్దతిస్తున్నారు. ఈ క్రమంలోనే హీరో హర్షవర్ధన్ రాణే తనకిష్టమైన బైక్‌ను ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు. ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్‌కు బదులుగా బైక్ తీసుకోవచ్చని ఇన్‌స్టాగ్రామ్ […]
దిశ, సినిమా : కొవిడ్‌తో భారత్ తల్లడిల్లుతుండగా.. ఈ ఆపద సమయంలో ప్రజలకు సాయం చేసేందుకు సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. సోషల్ మీడియా ఎకౌంట్స్‌లో హెల్ప్ లైన్ నంబర్స్ షేర్ చేస్తూ, హాస్పిటల్ బెడ్స్, ఆక్సిజన్ సిలిండర్ల లభ్యత గురించి ఇన్‌ఫర్మేషన్ ఇస్తున్నారు. మరికొందరు కొవిడ్ ఫండ్ రెయిజ్ చేస్తూ, విపత్కర పరిస్థితుల్లో దేశ ప్రజలకు మద్దతిస్తున్నారు. ఈ క్రమంలోనే హీరో హర్షవర్ధన్ రాణే తనకిష్టమైన బైక్‌ను ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు. ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్‌కు బదులుగా బైక్ తీసుకోవచ్చని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేశాడు. హైదరాబాద్‌లో ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ అందుబాటులో ఉంటే తనకు తెలపాలని కోరాడు.
గతంలో కరోనాతో పోరాడిన హర్షవర్ధన్ రాణే.. ఐసీయూలో ఉన్న సమయంలో ‘తైష్’ సినిమా కోసం డబ్బింగ్ చెప్పాడు. తన కోస్టార్స్ పుల్కిత్ సామ్రాట్, కృతి కర్బంధ ఈ సినిమా కోసం 2000 % కష్టపడ్డారని, వారి ముందు తను చేసింది కేవలం నామమాత్రమే అని తెలిపాడు.