పూరి బాటలో హరీష్ శంకర్
గతంలో ఎవరిదైనా జీవిత చరిత్ర చదవాలంటే.. పేజీలు పేజీలు చదవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు.. హెడ్‌ఫోన్స్ చెవిలో పెట్టుకుని సదరు వ్యక్తికి సంబంధించిన పాడ్‌కాస్ట్(డిజిటల్ ఆడియో) వింటే సరిపోతుంది. ఈ నేపథ్యంలోనే పాడ్‌కాస్ట్ చాలా పాపులర్ అయిపోగా.. చాలా మంది ప్రముఖులు తమ జీవిత అనుభవాలను తెలుపుతూ పాడ్‌కాస్ట్‌లను రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే.. టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కూడా ఇటీవలే ఓ పాడ్‌కాస్ట్‌ను మొదలు పెట్టారు. తన సినిమాల్లో డైలాగ్స్‌తో అభిమానులను ఈలలు వేయించే […]
గతంలో ఎవరిదైనా జీవిత చరిత్ర చదవాలంటే.. పేజీలు పేజీలు చదవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు.. హెడ్‌ఫోన్స్ చెవిలో పెట్టుకుని సదరు వ్యక్తికి సంబంధించిన పాడ్‌కాస్ట్(డిజిటల్ ఆడియో) వింటే సరిపోతుంది. ఈ నేపథ్యంలోనే పాడ్‌కాస్ట్ చాలా పాపులర్ అయిపోగా.. చాలా మంది ప్రముఖులు తమ జీవిత అనుభవాలను తెలుపుతూ పాడ్‌కాస్ట్‌లను రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే.. టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కూడా ఇటీవలే ఓ పాడ్‌కాస్ట్‌ను మొదలు పెట్టారు. తన సినిమాల్లో డైలాగ్స్‌తో అభిమానులను ఈలలు వేయించే పూరి.. ఇటీవలే తన జీవితంలోని కొన్ని విశేషాలను వివరిస్తూ ‘మ్యూజింగ్స్’ పేరుతో పాడ్‌కాస్ట్‌గా తీసుకొచ్చాడు. ఇప్పుడు పూరి బాటలోనే మరో టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ నడవనున్నాడు.
సెలెబ్రిటీల జీవిత విశేషాలను తెలుసుకోవడానికి సగటు అభిమానులు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు. సినీ పరిశ్రమకు చెందినవారైతే ఆ ఆసక్తి ఇంకాస్త ఎక్కువే ఉంటుంది. అందుకే గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ ‘సౌండ్స్ గుడ్’ అనే పేరుతో తన లైఫ్ మ్యాటర్‌ను అభిమానులతో పంచుకోవడానికి వస్తున్నాడు. ఇందులో హరీష్ మాటలతో పాటు, సెలెబ్రిటీలతో జరిపిన పలు ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్స్ ఉంటాయని తెలుస్తోంది. అందుకు సంబంధించిన విషయాలను ఆయన షేర్ చేసుకున్నారు.
‘గతంలో చాలా మంది రేడియోల్లో నాటకాలు వినేవారు. అవి వాయిస్ ద్వారానే ఎన్నో ఎమోషన్స్ పండించేవి. అలా వింటూనే పనులు చేసుకునేవారు. నేను ఇప్పుడు అన్ని ఎమోషన్స్ పండించకపోవచ్చు కానీ, మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటా. సినీ ప్రముఖులతో ఇంటరాక్ట్ అయి ఎన్నో కొత్త విషయాలను మీకు చెబుతా. అలాగే మా గ్యాంగ్ అందరితో మాట్లాడుతూ ఆ విశేషాలను మీతో షేర్ చేసుకుంటా’ అని హరీష్ పేర్కొన్నారు. గద్దలకొండ గణేష్ సినిమాతో హిట్ అందుకున్న హరీష్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను పవన్‌తో చేయనున్నారు.