తెలంగాణలో ఒమిక్రాన్.. హరీష్‌రావు కీలక వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అదేవిధంగా ప్రజలందరూ కరోనా వ్యాక్సిన్లు తీసుకోవాలని, బూస్టర్ డోస్ కోసం కూడా కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు. అయితే, ఒకవేళ కేసులు పెరిగితే మందుల కొరత లేకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు […]

Update: 2021-12-15 01:12 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అదేవిధంగా ప్రజలందరూ కరోనా వ్యాక్సిన్లు తీసుకోవాలని, బూస్టర్ డోస్ కోసం కూడా కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు. అయితే, ఒకవేళ కేసులు పెరిగితే మందుల కొరత లేకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని, గాలి ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున మాస్క్ తప్పనిసరిగా ధరించాలని ఆయన పిలుపునిచ్చారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..