కరోనా పేషెంట్‌కు హరీశ్‌రావు ఫోన్ చేసి..
దిశ, సిద్ధిపేట: ‘ఆధైర్య పడవద్దు.. అన్ని విధాలా అండగా ఉంటాను. మనము పోరాడవలసింది కరోనా వ్యాధితో కానీ, రోగితో కాదు’ అని మంత్రి హరీష్ రావు అన్నారు. నంగునుర్ మండలం రాంపూర్ గ్రామంలో కరోనా సోకిన వ్యక్తికి హరీశ్ రావు స్వయంగా ఫోన్ చేసి గుండె నిబ్బరం చేశాడు. మంత్రి స్వయంగా పంపిన ఐసోలేషన్ కిట్స్ ను నంగునూర్ మండలం రాంపూర్ గ్రామంలో కరోనా వ్యాధి సోకి గత రెండు రోజుల నుండి హోం ఐసోలేషన్ లో […]
దిశ, సిద్ధిపేట: ‘ఆధైర్య పడవద్దు.. అన్ని విధాలా అండగా ఉంటాను. మనము పోరాడవలసింది కరోనా వ్యాధితో కానీ, రోగితో కాదు’ అని మంత్రి హరీష్ రావు అన్నారు. నంగునుర్ మండలం రాంపూర్ గ్రామంలో కరోనా సోకిన వ్యక్తికి హరీశ్ రావు స్వయంగా ఫోన్ చేసి గుండె నిబ్బరం చేశాడు. మంత్రి స్వయంగా పంపిన ఐసోలేషన్ కిట్స్ ను నంగునూర్ మండలం రాంపూర్ గ్రామంలో కరోనా వ్యాధి సోకి గత రెండు రోజుల నుండి హోం ఐసోలేషన్ లో ఉన్న వారి కుటుంబ సభ్యులకు నంగునుర్ మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి స్వయంగా వెళ్లి వారి ఇంటికి వెళ్లి అందజేశాడు.
ఈ సందర్భంగా కరోనా వ్యాధి సోకిన వ్యక్తికి, అతని కుటుంబ సభ్యులకు కరోనా నివారణకు తీసుకోవలసిన తగు జాగ్రత్తలు సూచించారు. ప్రతి ఒక్కరూ ముఖానికి పసుపుతో ఆవిరి పట్టుకోవాలని, ప్రతిరోజూ వేడి నీరు, కషాయం తాగాలన్నారు. కరోనాకు మందు లేదని, ఆందోళన చెందాల్సిన పని లేదంటూ దైర్యం కల్పించారు. ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి లక్షల రూపాయలు ఖర్చు చేయవద్దు అని, వ్యాధి లక్షణాలు ఉన్నవారు హోం ఐసోలేష న్ లో ఉండాలని సూచించారు. కరోనా సోకినవారి పట్ల చిన్న చూపు చూడటం, వెలి వేయడం సరైన పద్ధతి కాదన్నారు. వ్యాధి తీవ్రత ఉన్నవారి కోసం సిద్ధిపేటలో 100 పడకల ఆసుపత్రిలో చికిత్స అందిస్తాన్నమన్నారు.