ఒక్క మనిషి కూడా మిగలొద్దు.. మంత్రి హరీష్‌రావు
దిశ, తెలంగాణ బ్యూరో: జనసాంద్రత ఎక్కువున్న పట్టణాల్లో వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసేందుకు రూరల్‌లో పనిచేసే వైద్య సిబ్బందిని కూడా అదనంగా ఏర్పాటు చేసుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు అధికారులకు సూచించారు. ఒక్క మనిషి మిగలకుండా టీకా ఇవ్వాలన్నారు. బుధవారం బీఆర్కే భవన్‌లో అన్ని జిల్లాల వైద్యాధికారులతో మంత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ గ్రామంలో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తికావాలన్నారు. టీకాల్లో వెనకబడిన జిల్లాల్లో డీఎంహెచ్‌ఓలు నేరుగా వెళ్లి పంపిణీలో వేగం […]
దిశ, తెలంగాణ బ్యూరో: జనసాంద్రత ఎక్కువున్న పట్టణాల్లో వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసేందుకు రూరల్‌లో పనిచేసే వైద్య సిబ్బందిని కూడా అదనంగా ఏర్పాటు చేసుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు అధికారులకు సూచించారు. ఒక్క మనిషి మిగలకుండా టీకా ఇవ్వాలన్నారు. బుధవారం బీఆర్కే భవన్‌లో అన్ని జిల్లాల వైద్యాధికారులతో మంత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ గ్రామంలో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తికావాలన్నారు. టీకాల్లో వెనకబడిన జిల్లాల్లో డీఎంహెచ్‌ఓలు నేరుగా వెళ్లి పంపిణీలో వేగం పెంచాలన్నారు. టీకా పంపిణీపై కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. వారం రోజుల తర్వాత అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహిస్తానని మంత్రి వెల్లడించారు.
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ రెండు డోసుల వాక్సిన్ త్వరగా పూర్తి చేయాలన్నారు. వందకు వంద శాతం మొదటి డోస్, రెండో డోస్ పూర్తి చేయాలని ఆదేశించారు. వికారాబాద్ జిల్లాలో వాక్సిన్ ప్రక్రియ వేగంగా సాగుతోందని, ఇదే తీరులో అన్ని జిల్లాలు ముందుకు సాగాలన్నారు. వాక్సినేషన్‌లో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా ఉండేలా పని చేయాలన్నారు. టీమ్ వర్క్‌తోనే ఇది సాధ్యమవుతుందన్నారు. ఈ టెలీ కాన్ఫరెన్స్‌లో ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ పాల్గొన్నారు.