సిద్దిపేటలోని చెక్ డ్యాములను పరిశీలించిన మంత్రి హరీశ్ రావు
దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మందపల్లి – నర్సాపూర్ వద్ద కుడి పైపులైన్ కాలువ, చెక్ డ్యాముల ద్వారా పారుతున్న నీళ్లను ఆదివారం మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. ఈ పైపులైన్ కాలువ ద్వారా మందపల్లి చెరువులు, కుంటలు నిండుతూనే సిద్దిపేట వాగులోకి నీళ్లు చేరనున్నాయని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. వీటితో పాటుగా 28 చెక్‌డ్యామ్‌లు, 11 గ్రామాల్లో చెరువులు, కుంటలు నింపడంతో పాటుగా కోహెడ మండలం శనిగరం గ్రామ చెరువు కూడా నిండుతుందన్నారు. […]
దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మందపల్లి – నర్సాపూర్ వద్ద కుడి పైపులైన్ కాలువ, చెక్ డ్యాముల ద్వారా పారుతున్న నీళ్లను ఆదివారం మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. ఈ పైపులైన్ కాలువ ద్వారా మందపల్లి చెరువులు, కుంటలు నిండుతూనే సిద్దిపేట వాగులోకి నీళ్లు చేరనున్నాయని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. వీటితో పాటుగా 28 చెక్‌డ్యామ్‌లు, 11 గ్రామాల్లో చెరువులు, కుంటలు నింపడంతో పాటుగా కోహెడ మండలం శనిగరం గ్రామ చెరువు కూడా నిండుతుందన్నారు. అనంతరం మిట్టపల్లి శివారులో నంగునూరు మండలానికి వెళ్లే ప్రధాన కుడి కాలువ, పైపులైన్ ద్వారా పారుతున్న నీళ్లను కూడా మంత్రి హరీశ్ రావు పరిశీలించారు.
tag: Minister Harish Rao, inspects, check dams, Siddipet