పది మందికి మన జీవితం ఉపయోగపడాలి
దిశ, మెదక్: పది మందికి మన జీవితం ఉపయోగపడాలి.! ఎవరి స్థాయిలో వారు ముందుకు రావాలి.! ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనే మనుషుల్లో సమాజ విలువలు పెరుగుతాయి.! ఆ దిశలో సిద్దిపేట పద్మశాలి సమాజం రుజువు చేస్తున్నదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. సిద్దిపేటలోని పద్మశాలి సంఘం భవనంలో శుక్రవారం మధ్యాహ్నం కరోనా విపత్తు సందర్భంగా.. 150 మంది చేనేత కార్మికులకు ఉచితంగా నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా […]
దిశ, మెదక్: పది మందికి మన జీవితం ఉపయోగపడాలి.! ఎవరి స్థాయిలో వారు ముందుకు రావాలి.! ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనే మనుషుల్లో సమాజ విలువలు పెరుగుతాయి.! ఆ దిశలో సిద్దిపేట పద్మశాలి సమాజం రుజువు చేస్తున్నదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. సిద్దిపేటలోని పద్మశాలి సంఘం భవనంలో శుక్రవారం మధ్యాహ్నం కరోనా విపత్తు సందర్భంగా.. 150 మంది చేనేత కార్మికులకు ఉచితంగా నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హరీశ్ రావు ప్రసంగించారు. కష్టకాలంలో ఏ సంఘమైనా పేదవారికి అండగా ఉండాలని, లాక్ డౌన్ సందర్భంగా చేనేత కార్మికులకు పని లేకుండా పోయిందని మా వంతు సాయంగా మేమున్నామని పద్మశాలి సమాజం ముందుకు రావడం అభినందనీయమని మంత్రి తెలిపారు.
పారిశుద్ధ్య కార్మికులకు గుడ్లు పంపిణీ:
కరోనా రావొద్దంటే.. పౌష్టికాహారం తినాలని మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న 500 మంది వాటర్ సప్లయ్, విద్యుత్, సఫాయి కార్మికులకు ఒక్కొక్కరికీ 60 గుడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. కార్మికుల కష్టం గొప్పదన్నారు. విధులు నిర్వహిస్తున్న వారంతా తప్పకుండా మాస్కులు, గ్లౌజులు ధరించాలని చెప్పారు. శానిటైజర్లను తప్పక వాడాలని ఆయన సూచించారు. సిద్ధిపేట మున్సిపల్ సఫాయి కార్మికులు చాలా బాగా పని చేస్తున్నారని.. త్వరలోనే వారికి మంచి గిఫ్ట్ ఇస్తామని మంత్రి హరీశ్ రావు చెప్పారు.
Tags: harish rao, Weavers, municipal workers,eggs, Essentials, Distribution, siddipet