ఉస్మానియా ఆస్పత్రి పారిశుధ్య సిబ్బందిపై మంత్రి హరిష్ రావు షాకింగ్ కామెంట్స్..

దిశ ప్రతినిధి, హైదరాబాద్: నెలకు సుమారు 1000 వరకు పోస్టుమార్టంలు జరిగే ఉస్మానియా ఆస్పత్రికి నూతన మార్చురీ భవనం నిర్మాణం కోసం రూ. 5 కోట్లు తక్షణమే మంజూరు చేస్తున్నట్లు మంత్రి హరీష్ రావు వెల్లడించారు. అత్యాధునీక వసతులలో కూడిన నూతన మార్చురీ పనులు త్వరలో ప్రారంభమౌతాయని చెప్పారు. మార్చురీ ప్రస్తుత భవనాన్ని ఆయన పరిశీలించి ఉన్న వసతులు, ఇబ్బందులను సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్, హెచ్ఓడీ డాక్టర్ తకియుద్ధిన్‌లను అడిగి తెలుసుకున్నారు. ఉస్మానియాతో పాటు రాష్ట్రంలోని అన్ని […]

Update: 2021-12-14 10:00 GMT

దిశ ప్రతినిధి, హైదరాబాద్: నెలకు సుమారు 1000 వరకు పోస్టుమార్టంలు జరిగే ఉస్మానియా ఆస్పత్రికి నూతన మార్చురీ భవనం నిర్మాణం కోసం రూ. 5 కోట్లు తక్షణమే మంజూరు చేస్తున్నట్లు మంత్రి హరీష్ రావు వెల్లడించారు. అత్యాధునీక వసతులలో కూడిన నూతన మార్చురీ పనులు త్వరలో ప్రారంభమౌతాయని చెప్పారు. మార్చురీ ప్రస్తుత భవనాన్ని ఆయన పరిశీలించి ఉన్న వసతులు, ఇబ్బందులను సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్, హెచ్ఓడీ డాక్టర్ తకియుద్ధిన్‌లను అడిగి తెలుసుకున్నారు. ఉస్మానియాతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆస్పత్రుల మార్చురీలను ఆధునీకరించాలని సీఎం కేసీఆర్ చేసిన ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల మార్చురీలను త్వరలో ఆధునీకరించనున్నట్లు తెలిపారు‌. ఇందుకోసం త్వరలో ప్రతిపాదనలు సిద్దం చేయనున్నట్లు తెలిపారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం సూచనలతో ఇకపై మార్చురీల వద్ద రాత్రి పూట కూడా పోస్టుమార్టం చేయనున్నట్లు తెలిపారు. ఆధునీకరించే మార్చురీ అందుబాటులోకి వచ్చే వరకు పాత మార్చురీ వద్ద అవసరమైన విద్యుత్ లైట్లు, ఇతర సౌకర్యాలు కూడా కల్పించనున్నామన్నారు. ఈ మేరకు మంగళవారం ఉస్మానియా ఆస్పత్రిలో రూ. 7 కోట్ల వ్యయంతో క్యాథల్యాబ్, రూ 2.12 కోట్లతో సీటీ స్కాన్‌లను డీఎంఈ డాక్టర్ రమేష్ రెడ్డి, సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్‌లతో కలిసి ప్రారంభించారు.

అనంతరం సుమారు మూడు గంటలకు పైగా వైద్యులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఉస్మానియా ఆస్పత్రిలో రెండు సీటీ స్కాన్‌లు ఉండగా తాజాగా ఏర్పాటు చేసిన దానితో వీటి సంఖ్య మూడు చేరిందన్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందాలంటే స్కానింగ్ రిపోర్ట్ తప్పనిసరని, అందుకే రిపోర్టులు 24 గంటలలోగా ఇచ్చేలా హాస్పిటల్‌లో ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. క్యాథల్యాబ్ చాలా రోజులుగా లేకపోవడం వల్ల గుండె జబ్బుల రోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న సీఎం కేసీఆర్ రూ 7 కోట్ల వ్యయంతో నూతన క్యాథల్యాబ్ ఉస్మానియాకు మంజూరు చేశారని అన్నారు. దీంతో గుండె జబ్బుల పరీక్షల కోసం రోగులు ఇకపై హాస్పిటల్ బయటకు వెళ్లే అవసరం లేదన్నారు.

త్వరలో మరో నాలుగు క్యాథల్యాబ్‌లు అందుబాటులోకి..

రాష్ట్రంలో త్వరలో మరో 4 క్యాథల్యాబ్‌లు అందుబాటులోకి తేనున్నట్లు మంత్రి హరీష్ రావు చెప్పారు. ఖమ్మం జిల్లాలో వారం పది రోజులలో క్యాథల్యాబ్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. అదిలాబాద్ రిమ్స్‌లో కూడా క్యాథల్యాబ్‌ను ఏర్పాటు చేసేందుకు పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. గాంధీ‌లో యాబైరోజులలో, వరంగల్ ఆస్పత్రిలో వీలైనంత త్వరగా క్యాథల్యాబ్ అందుబాటులోకి తేనున్నామన్నారు. రాష్ట్రంలో మొత్తంగా ఐదు చోట్ల ఈ యంత్రాలు వినియోగంలోకి తెచ్చి గుండె జబ్బుతో బాధ పడుతున్న రోగులకు ప్రభుత్వ రంగ ఆస్పత్రులలో నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు.

ఉస్మానియాలో 50 ఐసీయూ పడకలు..

ఉస్మానియా ఆస్పత్రిలో 50 పడకల ఐసీయూ నిర్మాణంలో ఉందని రెండు నెలల్లో దీనిని అందుబాటులోకి తెస్తామన్నారు. ఆస్పత్రిలో 180 వెంటిలేటర్లు ఉండగా 102 పని చేస్తున్నాయని, మిగిలిన 78 వెంటిలేటర్లకు మరమ్మత్తులు చేసి వినియోగంలోకి తేవడం జరుగుతుందన్నారు. రేడియాలజీ, పాథలాజీ విభాగాలలో ఏ రోజుకు ఆ రోజు పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఉస్మానియా పాత భవనం విషయమై కోర్టులో ఉన్న కేసుకు వీలైనంత త్వరగా పరిష్కారం చూపి నూతన భవనం నిర్మాణం కోసం చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. ఆక్సీజన్‌కు ఎలాంటి ఇబ్బందులు లేవని, అన్ని పడకలకు ఆక్సీజన్ సౌకర్యం ఉందన్నారు. డైట్ క్వాలిటీ పెంచేందుకు అదనంగా ఇఫ్పుడిస్తున్న మొత్తానికి డబ్బులు పెంచి నాణ్యమైన ఆహారాన్ని రోగులకు అందించడం జరుగుతుందని వివరించారు. ఉస్మానియా ఆస్పత్రిలో పారిశుధ్య సిబ్బంది సక్రమంగా పని చేయడం లేదని మంత్రి హరీష్ రావు అన్నారు‌. పారిశుధ్య పనుల నిర్వహణకు ఇప్పటి వరకు పనులు పొందిన వారి టెండర్లను రద్ధు చేసి కొత్తగా టెండర్‌ల ద్వారా ఇతరులకు కేటాయించాలని ఆయన డీఎంఈ డాక్టర్ రమేష్ రెడ్డి‌, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీలను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న వారు సక్రమంగా పని చేయడం లేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు‌.

ఉస్మానియాలో తొలి హోమో గ్రాఫ్ట్ సర్జరీ..

తీవ్రంగా కాలిన గాయాలతో బాధ పడుతున్న నవీన్ అనే యువకుడికి సర్జరీ చేయడం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆస్పత్రిలో మొట్టమొదటి సారి ఉస్మానియాలో స్కిన్ బ్యాంక్ సేవలు మొదలయ్యాయని డిపార్ట్ మెంట్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ ఇంచార్జ్ హెచ్ఓడీ డాక్టర్ నాగప్రసాద్, మంత్రి హరీష్ రావు సమక్షంలో వివరించారు‌. చనిపోయిన వారి నుంచి స్కిన్ తీసుకొని 45 రోజుల ప్రాసెస్ తర్వాత హోమోగ్రాఫ్ట్ చేస్తారని, కాలిన గాయాల‌పై స్కిన్‌తో సర్జరీ చేయడం జరుగుతుందని వివరించారు‌. ఉస్మానియా ఆస్పత్రిలో స్కిన్ బ్యాంక్ కోసం ఇప్పటి వరకు ఇద్దరి నుంచి చర్మం సేకరించడం జర్గిందని డాక్టర్ నాగప్రసాద్ తెలిపారు.

Tags:    

Similar News