రజినీ ‘దళపతి’ సీక్వెల్ రెడీ అవుతోందా?

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ యంగ్ హీరో హరీశ్ కళ్యాణ్ న్యూ మూవీ ఫస్ట్ లుక్ వైరల్ అయింది. మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా, డైరెక్టర్ ఎలన్, హరీశ్ కళ్యాణ్ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమాలో మల్టిపుల్ అవతార్స్ ఉంటాయని ఇప్పటికే స్పష్టం చేయగా.. తలైవా పుట్టినరోజు పురస్కరించుకుని ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ‘స్టార్’ టైటిల్‌తో వస్తున్న సినిమాలో హరీశ్ కళ్యాణ్ లుక్.. రజినీకాంత్ దళపతి సినిమా లుక్‌ను రీక్రియేట్ చేయగా కామెంట్ […]

Update: 2020-12-12 05:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ యంగ్ హీరో హరీశ్ కళ్యాణ్ న్యూ మూవీ ఫస్ట్ లుక్ వైరల్ అయింది. మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా, డైరెక్టర్ ఎలన్, హరీశ్ కళ్యాణ్ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమాలో మల్టిపుల్ అవతార్స్ ఉంటాయని ఇప్పటికే స్పష్టం చేయగా.. తలైవా పుట్టినరోజు పురస్కరించుకుని ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ‘స్టార్’ టైటిల్‌తో వస్తున్న సినిమాలో హరీశ్ కళ్యాణ్ లుక్.. రజినీకాంత్ దళపతి సినిమా లుక్‌ను రీక్రియేట్ చేయగా కామెంట్ సెక్షన్ ఫుల్ పాజిటివ్ కామెంట్స్‌తో నిండిపోయింది. కాస్టూమ్, మేకప్, హెయిర్ టోటల్‌గా రజినీని తలపిస్తుండగా.. హీరోకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు తలైవా ఫ్యాన్స్.

కాగా లెజెండరీ యాక్టర్ రజినీ లుక్‌ను తన ఫస్ట్ లుక్‌గా డిజైన్ చేసిన స్టార్ మూవీ యూనిట్‌కు కృతజ్ఞతలు తెలిపారు హీరో హరీశ్ కళ్యాణ్. కొద్ది కొద్దిగా ఇలాంటి మరిన్ని సర్‌ప్రైజ్‌లు మీ ముందుకు తీసుకొస్తానని ఆడియన్స్‌కు ప్రామిస్ చేశాడు. అయితే స్టార్ ఫస్ట్ లుక్ చూశాక.. ఈ సినిమా దళపతి మూవీ సీక్వెల్‌గా రాబోతుందా? అనే ప్రశ్న నెటిజన్లలో తలెత్తుతుండటం గమనార్హం.

Tags:    

Similar News

Sharvari

Ishita Raj Sharma