బత్తాయిలమ్మి బడి కట్టించిన నిజమైన శ్రీమంతుడికి పద్మశ్రీ
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రస్తుతం చదువుకోవాలంటే చదువు కొనాల్సిందే. అయితే, ప్రభుత్వ బడులకు ధీటుగా.. ఉచితంగా పేద పిల్లలకు చదువును అందించడం కోసం చాలా తక్కువ మంది కోటీశ్వరులు ముందుకు వస్తుంటారు. కానీ, బత్తాయి పండ్లను అమ్మి.. వాటి ద్వారా వచ్చిన డబ్బుతో ఓ బడిని ఏర్పాటు చేసి పేద వారికి ఉచితంగా విద్యను అందించడాన్ని ఎక్కడైన చూశారా. అవును.. దక్షిణ కన్నడ జిల్లాలోని మంగుళూరు తాలుకా న్యూపడపు గ్రామానికి చెందిన హరేకల హజబ్బా.. పండ్లు అమ్మితే […]
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రస్తుతం చదువుకోవాలంటే చదువు కొనాల్సిందే. అయితే, ప్రభుత్వ బడులకు ధీటుగా.. ఉచితంగా పేద పిల్లలకు చదువును అందించడం కోసం చాలా తక్కువ మంది కోటీశ్వరులు ముందుకు వస్తుంటారు. కానీ, బత్తాయి పండ్లను అమ్మి.. వాటి ద్వారా వచ్చిన డబ్బుతో ఓ బడిని ఏర్పాటు చేసి పేద వారికి ఉచితంగా విద్యను అందించడాన్ని ఎక్కడైన చూశారా. అవును.. దక్షిణ కన్నడ జిల్లాలోని మంగుళూరు తాలుకా న్యూపడపు గ్రామానికి చెందిన హరేకల హజబ్బా.. పండ్లు అమ్మితే వచ్చే సంపాదనతోనే పేద విద్యార్థుల కోసం పాఠశాల నిర్మించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు.
హజబ్బా నిరక్షరాస్యుడు కావడంతో, తనలా మరెవరు కాకూడదని, ఎంతో మంది పేద పిల్లలకు ఉచిత విద్యను అందించడానికి 68 ఏళ్లలోనూ రోడ్డెక్కి పండ్లు అమ్ముతున్నారు. ఈయన సంపాదనతో పాటు దాతల సహకారంతో న్యూపడపు గ్రామంలో పాఠశాల నిర్మించారు. అందుకే దేశ నాలుగో అత్యున్నత పురస్కారం పద్మశ్రీ హరేకల హజబ్బాను వరించింది. ఈ సందర్భంగా కేంద్రం సోమవారం పద్మ అవార్డులను ప్రదానం చేసింది. ఈ కార్యక్రమానికి వచ్చిన హరేకల హజబ్బా తెల్లటి ధోతి, చొక్కా, మెడలో కండువా, కాళ్లకు చెప్పులు లేకుండా హాజరయి ప్రత్యేకంగా నిలిచారు.