మోడర్న్ థాలి.. సర్ఫ్ అండ్ ఈట్!
దిశ, వెబ్‌డెస్క్ : ఉదయం కళ్లు తెరవడంతోనే దేవుణ్ని చూడటం మానేసి.. ఫోన్ చూడటం ఎప్పుడో మొదలైంది. ఇంటా, బయటా, గ్రౌండ్‌లో, ఫంక్షన్‌లో, గుడిలో, పూజలో ఎక్కడా చూసినా.. ఫోన్ చెక్ చేస్తూనే ఉంటాం. నిద్రపోయే ముందు కూడా ఫోన్ చూడకపోతే నిద్ర రాదంటూ.. అసలు రాత్రంతా నిద్రే పోరు కొందరు. మన లైఫ్ సైకిల్‌ను, స్లీపింగ్ సైకిల్‌ను పూర్తిగా సెల్‌ఫోన్ మార్చేసిందనండంలో సందేహం లేదు. అయితే, ఇదే విషయాన్ని టీమిండియా మాజీ బౌలర్ హర్భజన్ సింగ్ […]
దిశ, వెబ్‌డెస్క్ : ఉదయం కళ్లు తెరవడంతోనే దేవుణ్ని చూడటం మానేసి.. ఫోన్ చూడటం ఎప్పుడో మొదలైంది. ఇంటా, బయటా, గ్రౌండ్‌లో, ఫంక్షన్‌లో, గుడిలో, పూజలో ఎక్కడా చూసినా.. ఫోన్ చెక్ చేస్తూనే ఉంటాం. నిద్రపోయే ముందు కూడా ఫోన్ చూడకపోతే నిద్ర రాదంటూ.. అసలు రాత్రంతా నిద్రే పోరు కొందరు. మన లైఫ్ సైకిల్‌ను, స్లీపింగ్ సైకిల్‌ను పూర్తిగా సెల్‌ఫోన్ మార్చేసిందనండంలో సందేహం లేదు. అయితే, ఇదే విషయాన్ని టీమిండియా మాజీ బౌలర్ హర్భజన్ సింగ్ తనదైన స్టైల్‌లో చెప్పుకొచ్చాడు. ‘మోడర్న్ థాలి’ తెలుసా? అంటూ సోషల్ మీడియాలో తాజాగా ఓ పోస్ట్ పెట్టాడు. ఇంతకీ హర్భజన్ చెప్పే ‘మోడర్న్ థాలి’ అంటే ఏంటో తెలుసుకుందాం.
ఒకప్పుడు మనం భోజనం చేసేటప్పుడు ఎవరైనా మాట్లాడితే ‘ష్.. సైలెన్స్!’ తినేటప్పుడు మాట్లాడకూడదంటూ పెద్దవాళ్లు పిల్లలను మందలించేవాళ్లు. అయితే, రానురాను కాలం మారిపోయింది. ఆ సైలెన్స్ బద్దలైపోయి.. టీవీ లేనిది భోజనం చేయమని మారాం చేసేదాకా వచ్చి, అక్కడి నుంచి సెల్‌ఫోన్‌లో ముఖాలు పెట్టి.. ఒకరి ముఖం ఒకరికి కనపడకుండా తినే వరకు వచ్చేశాం. అయితే, ఇప్పుడు కొత్తగా.. ఓ పల్లెంలో కూరలు, చట్నీ, పెరుగు, సాంబార్, రసంతో పాటు సెల్ ఫోన్ కూడా పెట్టుకునేందుకు డెడికేటెడ్ ప్లేస్ ఇవ్వడం విశేషం. అంటే ఎంచక్కా.. అక్కడే సర్ఫ్ చేసుకుంటూ, చాట్ చేసుకుంటూ.. టిఫిన్, భోజనం కానిచ్చేయొచ్చన్న మాట. సో ఇదే.. మాడర్న్ థాలి. ఈ ప్లేట్ ఫొటోను షేర్ చేసిన హర్భజన్ సింగ్. ‘ఫోన్ స్పేస్ అందిస్తూ.. మోడర్న్ థాలి. ఆర్డర్ యువర్స్’ అంటూ నవ్వుతున్న ఎమోజీలను పెట్టాడు.
హర్భజన్ పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుండగా.. ఫోన్‌కు అడిక్ట్ అయిన వారికి ఇది పర్‌ఫెక్ట్ థాలి అని నెటిజన్లు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ‘వైర్ లెస్ చార్జింగ్ ఉందా?, బెస్ట్ సొల్యూషన్ ఫర్ టుడే వరల్డ్, ఈ పోస్ట్ చదువుతూ.. నేను అదే చేస్తున్నాను.. ఒక చేతిలో భోజనం ప్లేటు.. మరో చేతిలో ఫోను’ అనే కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.