గుజరాత్ హరప్పన్ ధోలవీరాకు యునెస్కో గుర్తింపు
న్యూఢిల్లీ: భారత ఘనమైన చరిత్రకు మరో అరుదైన గుర్తింపు లభించింది. హరప్పా నాగరికతకు చెందిన గుజరాత్‌లోని ధోలవీరకు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు దక్కింది. ఐరాస యూనెస్కోకు చెందిన వరల్డ్ హెరిటేజ్ కమిటీ(డబ్ల్యూహెచ్‌సీ) 44వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గుజరాత్‌లో ఇప్పటికే మూడు యునెస్కో గుర్తింపు పొందిన సైట్లున్నాయి. అవి పావాగద్ సమీపంలోని చాంపనార్, పటాన్‌లోని రాణీ కీ వావ్, చారిత్రక అహ్మదాబాద్ నగరాలు వారసత్వ సంపద జాబితాలో ఉన్నాయి. ధోలవీరకు గుర్తింపుతో యునెస్కో హెరిటేజ్ […]
న్యూఢిల్లీ: భారత ఘనమైన చరిత్రకు మరో అరుదైన గుర్తింపు లభించింది. హరప్పా నాగరికతకు చెందిన గుజరాత్‌లోని ధోలవీరకు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు దక్కింది. ఐరాస యూనెస్కోకు చెందిన వరల్డ్ హెరిటేజ్ కమిటీ(డబ్ల్యూహెచ్‌సీ) 44వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గుజరాత్‌లో ఇప్పటికే మూడు యునెస్కో గుర్తింపు పొందిన సైట్లున్నాయి. అవి పావాగద్ సమీపంలోని చాంపనార్, పటాన్‌లోని రాణీ కీ వావ్, చారిత్రక అహ్మదాబాద్ నగరాలు వారసత్వ సంపద జాబితాలో ఉన్నాయి. ధోలవీరకు గుర్తింపుతో యునెస్కో హెరిటేజ్ సైట్ల జాబితాలో భారత్‌కు చెందిన 40 సైట్లు చోటుదక్కించుకున్నట్టయ్యాయి. ములుగు జిల్లాల్లోని రామప్ప ఆలయానికి ఆదివారం యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే. గతేడాది కరోనా కారణంగా డబ్ల్యూహెచ్‌సీ సమావేశాలు సాధ్యపడలేదు. తాజాగా చైనాలోని ఫుజౌలో వర్చువల్‌గా జరుగుతున్నది. ఈ నెల 16న మొదలైన ఈ సమావేశాలు 31న ముగియనున్నాయి.
దేశానికి గర్వకారణం: కిషన్ రెడ్డి
యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో భారత్ నుంచి 40వ సైట్‌గా ధోలవీరకు చోటు లభించిందని తెలియజేయడానికి గర్వంగా ఫీల్ అవుతున్నట్టు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. ఇది దేశానికి గర్వకారణమని, దేశానికి ముఖ్యంగా గుజరాతీయులకు ప్రత్యేకమైన రోజు అని పేర్కొన్నారు. 2014 నుంచి ఇండియా పది సైట్లకు ప్రపంచ వారసత్వ సందప గుర్తింపును దక్కించుకున్నదని, భారత సంస్కృతిని, భారతీయుల జీవిత విధానాన్ని ప్రపంచానికి తెలియజేయడంలో ప్రధాని మోడీ కృతనిశ్చయాన్ని ఇది వెల్లడిస్తున్నదని వివరించారు.