కొడుకు రోగాన్ని అడ్డుపెట్టుకుని పాలిటిక్స్ చేస్తున్న డైరెక్టర్..

దిశ, సినిమా : డైరెక్టర్ హన్సల్ మెహతా గవర్నమెంట్ చేపట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్ ఎలిజిబిలిటీ క్రైటేరియా గురించి ప్రశ్నించారు. యూనియన్ హెల్త్ సెక్రెటరీ రాజేష్ భూషణ్ కరోనా వ్యాక్సిన్ ‘కావాలి అనుకున్న వారికి కాదు, అవసరమున్న వారికి ఉద్దేశించినది’ అని ప్రకటించగా.. దీనిపై కామెంట్ చేశారు దర్శకులు. తన 25 ఏళ్ల కొడుకు పల్లవకు డౌన్ సిండ్రోమ్‌ ఉందని, రెస్పిరేటరీ ఫెయిల్యూర్‌తో కొన్నేళ్లుగా బాధపడుతున్నాడని తెలిపాడు. మరి తను వ్యాక్సిన్ కోరుకుంటున్నాడా? లేక తనకు వ్యాక్సిన్ అవసరమా? […]

Update: 2021-04-08 04:47 GMT

దిశ, సినిమా : డైరెక్టర్ హన్సల్ మెహతా గవర్నమెంట్ చేపట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్ ఎలిజిబిలిటీ క్రైటేరియా గురించి ప్రశ్నించారు. యూనియన్ హెల్త్ సెక్రెటరీ రాజేష్ భూషణ్ కరోనా వ్యాక్సిన్ ‘కావాలి అనుకున్న వారికి కాదు, అవసరమున్న వారికి ఉద్దేశించినది’ అని ప్రకటించగా.. దీనిపై కామెంట్ చేశారు దర్శకులు. తన 25 ఏళ్ల కొడుకు పల్లవకు డౌన్ సిండ్రోమ్‌ ఉందని, రెస్పిరేటరీ ఫెయిల్యూర్‌తో కొన్నేళ్లుగా బాధపడుతున్నాడని తెలిపాడు. మరి తను వ్యాక్సిన్ కోరుకుంటున్నాడా? లేక తనకు వ్యాక్సిన్ అవసరమా? అని ట్వీట్ చేశాడు.

అయితే చాలా మంది నెటిజన్లు ఈ విషయంలో మెహతాకు సపోర్ట్ చేయగా.. ఓ నెటిజన్ మాత్రం కొడుకును అడ్డుపెట్టుకుని పాలిటిక్స్ చేస్తున్నాడని ఆరోపించాడు. ఈ క్రమంలోనే డౌన్ సిండ్రోమ్ అనేది ఒక వ్యాధి అని చెప్పాడు. దీనిపై స్పందించిన డైరెక్టర్.. డౌన్ సిండ్రోమ్ అనేది వ్యాధి కాదని క్లారిటీ ఇచ్చాడు. ఆ విషయంపై కొంచెం రీసెర్చ్ చేసి తెలుసుకోవాలని, ట్రోలింగ్‌ చేసే సమయాన్ని కొంచెం అటు వైపుగా కేటాయిస్తే బాగుంటుందని హితవు పలికాడు. చిలుక పలుకులు పలికేముందు తాను అడిగిన ప్రశ్నలో ఉన్న అర్థం ఏంటో తెలుసుకోవాలని సూచించాడు.

Tags:    

Similar News