'తీహార్'లో ఉరి రిహార్సల్స్
న్యూఢిల్లీ : నిర్భయ దోషులకు మంగళవారం ఉదయం ఆరుగంటలకు ఉరి శిక్ష అమలు చేయాలన్న డెత్ వారెంట్ అనుసరించి తీహార్ జైలులో వేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ డెత్ వారెంట్‌పై స్టే విధించేందుకు ఢిల్లీ కోర్టు తిరస్కరించడంతో జైలు అధికారులు రేపు నలుగురు దోషులను ఉరితీసే పనులను వేగవంతం చేస్తున్నారు. ఉరితీసే తలారీ పవన్ జల్లాడ్ ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. తీహార్ జైలులో ఉరి తీతకు సంబంధించిన రిహార్సల్స్ జరుగుతున్నాయి. గతంలోనూ పవన్ తీహార్ జైలుకు చేరుకుని […]
న్యూఢిల్లీ : నిర్భయ దోషులకు మంగళవారం ఉదయం ఆరుగంటలకు ఉరి శిక్ష అమలు చేయాలన్న డెత్ వారెంట్ అనుసరించి తీహార్ జైలులో వేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ డెత్ వారెంట్‌పై స్టే విధించేందుకు ఢిల్లీ కోర్టు తిరస్కరించడంతో జైలు అధికారులు రేపు నలుగురు దోషులను ఉరితీసే పనులను వేగవంతం చేస్తున్నారు. ఉరితీసే తలారీ పవన్ జల్లాడ్ ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. తీహార్ జైలులో ఉరి తీతకు సంబంధించిన రిహార్సల్స్ జరుగుతున్నాయి. గతంలోనూ పవన్ తీహార్ జైలుకు చేరుకుని ఉరి తీత రిహార్సల్స్ చేశారు. కానీ, దోషుల న్యాయపరమైన పిటిషన్లతో డెత్ వారెంట్ వాయిదా పడిన విషయం తెలిసిందే.
Tags : nirbhaya, hanging, executioner, pawan jallad, tihar jail