ఆగిపోయింది.. అందుకే ధర్నా

దిశ, మునుగోడు: గత నాలుగు నెలల నుండి చేనేత వస్త్రాల కొనుగోలు ఆగిపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నామని, మా సమస్యలు పరిష్కరించాలని నల్లగొండ జిల్లా చండూర్ పట్టణ కేంద్రంలో నిరవధిక రిలే నిరాహార దీక్షకు దిగారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోక పోవడంవలనే రోడ్డున పడ్డామని చేనేత కార్మికులు ఆవేదన చెందుతున్నారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేదాకా ఈ దీక్షలు కొనసాగిస్తామని తెలిపారు. నిల్వ ఉన్న చేనేత వస్త్రాలను వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని, కరోనా […]

Update: 2020-07-13 05:02 GMT

దిశ, మునుగోడు: గత నాలుగు నెలల నుండి చేనేత వస్త్రాల కొనుగోలు ఆగిపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నామని, మా సమస్యలు పరిష్కరించాలని నల్లగొండ జిల్లా చండూర్ పట్టణ కేంద్రంలో నిరవధిక రిలే నిరాహార దీక్షకు దిగారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోక పోవడంవలనే రోడ్డున పడ్డామని చేనేత కార్మికులు ఆవేదన చెందుతున్నారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేదాకా ఈ దీక్షలు కొనసాగిస్తామని తెలిపారు. నిల్వ ఉన్న చేనేత వస్త్రాలను వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని, కరోనా భృతి కింద నెలకు రూ.8000 ఇవ్వాలని, చేనేత వస్త్రాలపై జిఎస్టీని తొలగించాలని, త్రిప్ట్ ఫండ్ ప్రభుత్వమే కార్మికుని పేర నమోదు చేయించాలంచూ వారు రిలే నిరాహారదీక్ష చేపట్టారు. ఈ దీక్షా శిబిరంలో చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు తిరందాసు శ్రీను, మాస్టర్ వీవర్ అధ్యక్షులు జూలూరు ఆంజనేయులు, పద్మ శాలి సంఘం అధ్యక్షులు రాపోలు నారాయణ, కోమటి వీరేశం,కౌన్సిలర్లు చిలుకూరు రాధికశ్రీను, గుంటి వెంకటేశం, చేనేత సహకార సంఘం అధ్యక్షులు జూలూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News