రెండ్రోజుల్లో ప్రపంచకప్ ఫైనల్.. న్యూజిలాండ్‌కు భారీ షాక్

దిశ, వెబ్‌డెస్క్: T20 వరల్డ్ కప్‌లో భాగంగా ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియ వేదికగా తలపడనున్నాయి. ఇప్పటికే ఈ మ్యాచ్‌కు సర్వం సిద్ధం కాగా, ఎలాగైనా కప్ కొట్టాలని ఇరు జట్లు తహతహలాడుతున్నాయి. అయితే, ఈ కీలకమైన ఈ మ్యాచ్‌కు ముందు కివీస్ జట్టుకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. సెమీ ఫైనల్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన బ్యాటర్ డెవాన్ కాన్వే గాయం కారణంగా ఫైనల్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. […]

Update: 2021-11-12 11:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: T20 వరల్డ్ కప్‌లో భాగంగా ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియ వేదికగా తలపడనున్నాయి. ఇప్పటికే ఈ మ్యాచ్‌కు సర్వం సిద్ధం కాగా, ఎలాగైనా కప్ కొట్టాలని ఇరు జట్లు తహతహలాడుతున్నాయి. అయితే, ఈ కీలకమైన ఈ మ్యాచ్‌కు ముందు కివీస్ జట్టుకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. సెమీ ఫైనల్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన బ్యాటర్ డెవాన్ కాన్వే గాయం కారణంగా ఫైనల్ మ్యాచ్‌కు దూరమయ్యాడు.

ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో 14వ ఓవర్‌లో లియామ్ లివింగ్‌స్టన్ బౌలింగ్‌లో కాన్వే అవుటైన తర్వాత తన బ్యాటును విసిరేశాడు. ఈ క్రమంలో అతడి చేతికి తీవ్ర గాయమైంది. మ్యాచ్ అనంతరం అతడికి స్కానింగ్ పరీక్షలు నిర్వహించగా, కుడి చేతిలో ఫ్రాక్చర్ వచ్చినట్లు తేలింది. దీంతో ఫైనల్ మ్యాచ్‌కు అతడు దూరమవుతున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. డెవాన్ కాన్వే కేవలం ఆస్ట్రేలియాతో జరిగే టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు మాత్రమే కాకుండా.. ఆ తర్వాత ఇండియాతో జరిగే సిరీస్‌కు కూడా అందుబాటులో ఉండబోడని కివీస్ క్రికెట్ బోర్డు పేర్కొన్నది. కాన్వే లేకపోవడం కివీస్ జట్టుకు పెద్దలోటని చెప్పాలి.

Tags:    

Similar News