కోబి బ్రాయంట్ మరణాన్ని వాడుకుంటున్న హ్యాకర్లు

          లెజెండరీ బాస్కెట్ బాల్ ఆటగాడు కోబి బ్రాయంట్ ఆకస్మిక మరణాన్ని అభిమానులు జీర్ణించుకోకముందే ఆయన ఫొటోలను హ్యాకర్లు తప్పుడు పనుల కోసం వినియోగిస్తున్నారు. ఆయన ఫొటోల్లో గుర్తించడానికి వీలుకాని మాల్వేర్‌ని జొప్పించి దాని ద్వారా క్రిప్టోకరెన్సీ సృష్టిస్తున్నారు.           ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ వారు గుర్తించారు. బ్రాయన్ డెస్క్‌టాప్ ఇమేజ్‌లలో వారు ఈ మాల్వేర్‌ని కనిపెట్టారు. ఈ మాల్వేర్ వినియోగదారుడికి తెలియకుండానే […]

Update: 2020-02-01 22:58 GMT

లెజెండరీ బాస్కెట్ బాల్ ఆటగాడు కోబి బ్రాయంట్ ఆకస్మిక మరణాన్ని అభిమానులు జీర్ణించుకోకముందే ఆయన ఫొటోలను హ్యాకర్లు తప్పుడు పనుల కోసం వినియోగిస్తున్నారు. ఆయన ఫొటోల్లో గుర్తించడానికి వీలుకాని మాల్వేర్‌ని జొప్పించి దాని ద్వారా క్రిప్టోకరెన్సీ సృష్టిస్తున్నారు.

ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ వారు గుర్తించారు. బ్రాయన్ డెస్క్‌టాప్ ఇమేజ్‌లలో వారు ఈ మాల్వేర్‌ని కనిపెట్టారు. ఈ మాల్వేర్ వినియోగదారుడికి తెలియకుండానే కంప్యూటర్ వేగాన్ని తగ్గిస్తుందని వారు తెలిపారు. అయితే ఇప్పటికే ఈ మాల్వేర్‌‌ని కట్టడి చేయడానికి వారు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించి విండోస్ డిఫెండర్ స్మార్ట్‌స్క్రీన్ టూల్‌ని కూడా మైక్రోసాఫ్ట్ వారు అప్‌డేట్ చేసినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News