రానా.. రెస్టు టు ఫారెస్టు!

       రానా .. అడవిని కాపాడుకునేందుకు గర్జించాడు… పోరాడాడు… తన కెరియర్‌లోనే మరో ది బెస్ట్ పెర్ ఫార్మెన్స్ ఇచ్చాడు. చాలా గ్యాప్ తర్వాత పాన్ ఇండియా మూవీతో వస్తున్నాడు రానా. తెలుగులో అరణ్యగా, హిందీలో హాథీ మేరె సాథీగా, తమిళ్‌లో కాదన్‌గా వస్తున్న సినిమాలో అడవికి కష్టం వస్తే ఎదురునిలిచిన 50 ఏళ్ల వయస్సున్న వ్యక్తి పాత్రలో రానా వావ్ అనిపించాడు. హిందీలో రిలీజైన టీజర్‌ ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా […]

Update: 2020-02-13 02:18 GMT

రానా .. అడవిని కాపాడుకునేందుకు గర్జించాడు… పోరాడాడు… తన కెరియర్‌లోనే మరో ది బెస్ట్ పెర్ ఫార్మెన్స్ ఇచ్చాడు. చాలా గ్యాప్ తర్వాత పాన్ ఇండియా మూవీతో వస్తున్నాడు రానా. తెలుగులో అరణ్యగా, హిందీలో హాథీ మేరె సాథీగా, తమిళ్‌లో కాదన్‌గా వస్తున్న సినిమాలో అడవికి కష్టం వస్తే ఎదురునిలిచిన 50 ఏళ్ల వయస్సున్న వ్యక్తి పాత్రలో రానా వావ్ అనిపించాడు. హిందీలో రిలీజైన టీజర్‌ ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయ్.

ఆదివాసీగా, ఏనుగుల మావటిగా ఉండే రానా… అడవిలో టౌన్‌షిప్ కట్టేందుకు ప్లాన్ చేస్తే వన్యప్రాణులకు కలిగే నష్టం, జరిగే అనర్థాలకు అడ్డుపడడమే కథ. విలన్లకు ఎలా చెక్ పెట్టాడు.. ఫారెస్ట్‌ను ఎలా కాపాడనేది సినిమా. బిగ్గెస్ట్ ఫైట్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచిపోనున్న ఈ టఫ్ ఫైట్ … బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌ను సొంతం చేసుకుంటుందనే అనిపిస్తుంది. విజువల్ ట్రీట్‌గా కనిపిస్తున్న టీజర్.. సినిమాపై హైప్ క్రియేట్ చేసేసింది. సినిమా ఏప్రిల్ 2న విడుదల కానుండగా ఇప్పటి నుంచే ప్రమోషన్స్ ప్రారంభించింది చిత్ర యూనిట్.

ప్రభు సోలోమన్ దర్శకత్వం వహిస్తున్న అరణ్య సినిమాను ఇరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తోంది. శంతన్ మోయిత్రా మ్యూజిక్ అందిస్తుండగా… ఆస్కార్ అవార్డ్ విన్నర్ రెసుల్ పూకుట్టి సౌండ్ విజైనర్‌గా వర్క్ చేస్తున్నారు.

Tags:    

Similar News