ఒక్కడే తండ్రి.. తల్లులు 27.. తోబుట్టువులు 150 మంది

దిశ, ఫీచర్స్ : ఆచారాలు, సంప్రదాయాలు ఒక్కో మతంలో ఒక్కో రకంగా ఉంటాయి. పెళ్లితో పాటు పిల్లల్ని కనే విషయంలోనూ తేడాలుంటాయి. అలాంటి మతాల్లో ‘మోర్మోనిజం’ ఒకటి. ఇది క్రిస్టియానిటీకి దగ్గరగానే ఉన్నా.. ఇతర మత సమూహాలనుంచి దీన్ని వేరుచేసే లక్షణాల్లో ‘బహుభార్యత్వం(పాలిగామీ)’ ఒకటి. బహుభార్యత్వం లేదా ఒకరి కంటే ఎక్కువ మంది మహిళలను వివాహం చేసుకోవాలంటే సొసైటీ నుంచి చాలా ప్రశ్నలు ఎదురవడంతో పాటు మానవ హక్కులపై తీవ్ర చర్చకు దారితీస్తుంది. అయినప్పటికీ, తమ మత […]

Update: 2021-07-20 04:14 GMT

దిశ, ఫీచర్స్ : ఆచారాలు, సంప్రదాయాలు ఒక్కో మతంలో ఒక్కో రకంగా ఉంటాయి. పెళ్లితో పాటు పిల్లల్ని కనే విషయంలోనూ తేడాలుంటాయి. అలాంటి మతాల్లో ‘మోర్మోనిజం’ ఒకటి. ఇది క్రిస్టియానిటీకి దగ్గరగానే ఉన్నా.. ఇతర మత సమూహాలనుంచి దీన్ని వేరుచేసే లక్షణాల్లో ‘బహుభార్యత్వం(పాలిగామీ)’ ఒకటి. బహుభార్యత్వం లేదా ఒకరి కంటే ఎక్కువ మంది మహిళలను వివాహం చేసుకోవాలంటే సొసైటీ నుంచి చాలా ప్రశ్నలు ఎదురవడంతో పాటు మానవ హక్కులపై తీవ్ర చర్చకు దారితీస్తుంది.

అయినప్పటికీ, తమ మత విశ్వాసాలను అనుసరిస్తూ బహుభార్యత్వాన్ని కొనసాగిస్తున్న వ్యక్తులు ఉన్నారు. అయితే ఇలాంటి లైఫ్‌స్టైల్‌ను ఎలా కంటిన్యూ చేస్తున్నారో తెలుసుకోవడం కూడా ఆసక్తికరంగా ఉంటుంది. కాగా టిట్ టాకర్ కేయ్ జీరో.. 150 మంది తోబుట్టువులు గల పాలిగామస్ ఫ్యామిలీలో పెరిగిన తన అనుభవాలను పంచుకున్నాడు.

ముర్రే బ్లాక్ మోర్.. టిక్ టాక్ యూజర్లకు ‘కేయ్ జీరో’గా సుపరిచితుడు. ఇతను ఒక తండ్రి, 27 మంది తల్లులు, 150 మంది సిబ్లింగ్స్ గల పాలిగామస్ ఫ్యామిలీలో పెరగ్గా, అందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసిన తర్వాత పాపులర్ అయ్యాడు. అందరిలోకెల్లా మిడిల్ చైల్డ్ అయిన ముర్రే.. తన పేరెంట్స్ మరో బిడ్డను కనేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రకటించాడు. ఆ సంఖ్య కూడా 151తో ఆగిపోదని.. మల్టిపుల్ వైఫ్స్ మాదిరిగానే కంటిన్యూ అవుతుందని తెలిపాడు.

కాగా ఈ పిల్లలందరికీ ‘నేమింగ్ స్ట్రాటజీ’ ఫాలో అయిన పేరెంట్స్.. ఒకే సంవత్సరంలో పుట్టినవారందరికీ పేరులోని మొదటి అక్షరం సేమ్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పాడు. అయితే ఈ మత విశ్వాసాలు తనకు కరెక్ట్ అనిపించకపోవడంతో బయటికి వచ్చినట్లు వెల్లడించాడు.

తండ్రికి చెందిన మొత్తం 150 మంది సంతానంలో తన తల్లికి 10 మంది పిల్లలమని చెప్పిన ముర్రే.. పేరెంట్స్ అటెన్షన్ అందరికీ దక్కేది కాదని తెలిపాడు. అయితే ఇంత మంది సిబ్లింగ్స్ ఉండటం మాత్రం పెద్ద అడ్వాంటేజ్ అన్నాడు. ఎందుకంటే అంతమంది బ్రదర్స్, సిస్టర్స్ నడుమ ఒంటరిగా ఫీల్ అయ్యే చాన్స్ లేదన్నాడు.

ఇక తన ఫ్యామిలీ గురించిన అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ చేసిన మల్టిపుల్ వీడియోలకు 7.3 మిలియన్ వ్యూస్ దక్కగా, తన పేరెంట్స్ మరో బిడ్డను కనబోతున్నారని తెలిపిన వీడియో 6.8 M వ్యూస్ పొందింది. ఇక బహుభార్యత్వం చాలా వివాదాస్పద అంశం కాగా.. 1890లోనే ‘ది చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లాటర్-డే సెయింట్స్(ఎల్డీఎస్)’లో దీనిపై నిషేధం విధించారు. అయినప్పటికీ, మోర్మోన్స్ మతస్తులు ఇప్పటికీ ఒకరి కంటే ఎక్కువ జీవిత భాగస్వాములను కలిగి ఉంటున్నారు.

Tags:    

Similar News