వరంగల్‌లో భారీగా గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

దిశ, వరంగల్: ఉమ్మడి జిల్లాలో ఓ అక్రమంగా వాహనంలో భారీగా గుట్కా ప్యాకెట్లను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా లింగాల ఘణపురం పోలీసులు, టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు నెల్లుట్ల బైపాస్ వద్ద తనిఖీలు నిర్వహించారు. వాహనంలో రవాణా చేస్తున్న రూ. 10 లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లు, రూ. 6 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ వాహనం డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. […]

Update: 2020-06-09 02:44 GMT

దిశ, వరంగల్: ఉమ్మడి జిల్లాలో ఓ అక్రమంగా వాహనంలో భారీగా గుట్కా ప్యాకెట్లను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా లింగాల ఘణపురం పోలీసులు, టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు నెల్లుట్ల బైపాస్ వద్ద తనిఖీలు నిర్వహించారు. వాహనంలో రవాణా చేస్తున్న రూ. 10 లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లు, రూ. 6 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ వాహనం డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. హైదరాబాద్ నుంచి మహబూబాబాద్ కు గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్నట్లు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News