గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం?

దిశ, నాగర్‌కర్నూల్: నాగర్‌ కర్నూల్ జిల్లాలోని ఉయ్యాలవాడ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామ సమీపంలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల బాలికల పాఠశాల భవనం పైనుండి దూకి విద్యార్థిని(17) ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసింది. అర్థరాత్రి 12 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. తోటి విద్యార్థులు గమనించి ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చి, వెంటనే జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఐయిజ మండలానికి చెందిన విద్యా్ర్థిని ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నట్లు సమాచారం. […]

Update: 2021-12-08 21:39 GMT
Student Suicide Attempt
  • whatsapp icon

దిశ, నాగర్‌కర్నూల్: నాగర్‌ కర్నూల్ జిల్లాలోని ఉయ్యాలవాడ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామ సమీపంలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల బాలికల పాఠశాల భవనం పైనుండి దూకి విద్యార్థిని(17) ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసింది. అర్థరాత్రి 12 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. తోటి విద్యార్థులు గమనించి ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చి, వెంటనే జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఐయిజ మండలానికి చెందిన విద్యా్ర్థిని ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నట్లు సమాచారం. ఈ ఘటనలో బాలిక కుడికాలు విరగడంతో పాటు తలకు, కనుబొమ్మలకు బలమైన గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. కాగా, ప్రమాద సమయంలో పాఠశాలలో వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందారు. అయితే, బాలిక ఆత్మహత్యాయత్నం చేసిందా? లేక పైనుండి జారీ పడిందా? అన్న విషయం తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News