కథ మొదలు.. నెటిఫ్లిక్స్‌లో ‘గుంజన్ సక్సేనా’
బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం ‘గుంజన్ సక్సేనా – ది కార్గిల్ గర్ల్’. ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ మూవీస్, జీ స్టూడియోస్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాను డైరెక్ట్‌గా ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్. ‘తన స్ఫూర్తివంతమైన ప్రయాణం చరిత్రను సృష్టించింది. ఇది గుంజన్ సక్సేనా కథ’ అంటూ జాన్వీ కపూర్ వాయిస్‌తో ఉన్న కార్గిల్ గర్ల్ స్టోరీ […]
బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం ‘గుంజన్ సక్సేనా – ది కార్గిల్ గర్ల్’. ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ మూవీస్, జీ స్టూడియోస్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాను డైరెక్ట్‌గా ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్. ‘తన స్ఫూర్తివంతమైన ప్రయాణం చరిత్రను సృష్టించింది. ఇది గుంజన్ సక్సేనా కథ’ అంటూ జాన్వీ కపూర్ వాయిస్‌తో ఉన్న కార్గిల్ గర్ల్ స్టోరీ వీడియోను షేర్ చేశాడు కరణ్.
గుంజన్ సక్సేనా.. లక్నోకు చెందిన చిన్నారి. పెద్దయ్యాక పైలట్ అవ్వాలనే తన కలను సాకారం చేసుకోవాలనుకున్న చిన్న పిల్ల. కానీ ఆడపిల్లలు డ్రైవింగ్ కూడా సరిగా చేయలేరు.. ఈ పిల్ల పైలెట్ ఎలా అవ్వగలదని ప్రపంచం ప్రశ్నించింది. అయినా తను ఎవరినీ కేర్ చేయలేదు. ‘నా డ్రీమ్ ఫుల్ ఫిల్ అవుతుంది.. అందుకు నాన్న సహకరిస్తాడని’ తండ్రిపై నమ్మకం ఉంచింది. అనుకున్నట్లుగానే పట్టుదలతో పైలట్‌గా మారి.. భారతదేశ రక్షణకు 1999 కార్గిల్ వార్‌లో చితా హెలికాప్టర్ నడిపింది. యుద్ధంలో అడుగుపెట్టిన తొలి మహిళా ఎయిర్ ఫోర్సర్‌గా చరిత్ర సృష్టించింది. ఈ రోజు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో 1600 మంది మహిళా అధికారులున్నారు.. తమ కలను నెరవేర్చుకున్నారు. ‘జాన్వీ అనే నేను.. గుంజన్ సక్సేనా కల సాకారమైన ప్రయాణాన్ని వీక్షించేందుకు మీకు, మీ కుటుంబానికి స్వాగతం పలుకుతున్నా.. త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో’ అంటూ గుంజన్ సక్సేనా ఇన్‌స్పిరేషనల్ జర్నీని వివరించిన జాన్వీ.. నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాను చూసి ఎంజాయ్ చేయాలని సూచించింది. కాగా శరణ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జాన్ స్టివర్ట్, అమిత్ త్రివేది మ్యూజిక్ అందించారు.