ఈనెల 30 వరకు స్కూల్స్, కాలేజీలు బంద్..
దిశ, వెబ్ డెస్క్ : గుజరాత్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 30వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలను మూసివేస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. కరోనా కారణంగా ఇప్పటికే రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్ధులకు స్కూల్స్‌ను మూసివేసింది. రాబోయ్ బోర్డు పరీక్షల నేపథ్యంలో 10,11,12వ తరగతుల విద్యార్ధులకు మాత్రమే ఆఫ్‌లైన్‌లో […]
దిశ, వెబ్ డెస్క్ : గుజరాత్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 30వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలను మూసివేస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది.
కరోనా కారణంగా ఇప్పటికే రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్ధులకు స్కూల్స్‌ను మూసివేసింది. రాబోయ్ బోర్డు పరీక్షల నేపథ్యంలో 10,11,12వ తరగతుల విద్యార్ధులకు మాత్రమే ఆఫ్‌లైన్‌లో తరగతులను నిర్వహిస్తున్నారు. అయితే, విద్యార్ధుల తల్లిదండ్రుల అనుమతితోనే భౌతికంగా తరగతులు నిర్వహిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. సెకండ్ వేవ్ కారణంగా కేసులు పెరుగుతుండంతో ఆఫ్‌లైన్ తరగతులను కూడా నిలిపివేస్తు్న్నట్టు ప్రభుత్వం పేర్కొంది.